×
Ad

Malavika Sharma : పేద పిల్లలకు స్వయంగా చెప్పులు తొడుగుతున్న హీరోయిన్..

ఓ చారిటబుల్ ట్రస్ట్ తరపున గవర్నమెంట్ పాఠశాలలో చెప్పులు లేని వారికి, పలువురు పేద పిల్లలకు మాళవిక శర్మ చెప్పులు అందించింది. అలాగే తానే స్వయంగా వెళ్లి ఆ పిల్లలకు చెప్పులు తొడిగింది.

  • Published On : August 4, 2023 / 09:31 AM IST

Malavika Sharma helped Sandals to poor childrens

Malavika Sharma : హీరోయిన్ మాళవిక శర్మ తెలుగులో నేలటికెట్, రెడ్ సినిమాలతో పలకరించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రస్తుతం పలు సినిమాలు చేస్తుంది మాళవిక శర్మ. మాళవిక అప్పుడప్పుడు మంచి కార్యక్రమాలు కూడా చేస్తుంది. తాజాగా పేద పిల్లలకు చెప్పులు అందించడమే కాకుండా తానే స్వయంగా వారికి చెప్పులు తొడిగి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఓ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఓ గవర్నమెంట్ పాఠశాలలో చెప్పులు లేని వారికి, పలువురు పేద పిల్లలకు మాళవిక శర్మ చెప్పులు అందించింది. అలాగే తానే స్వయంగా వెళ్లి ఆ పిల్లలకు చెప్పులు తొడిగింది. పిల్లలకు చెప్పులు తొడిగిన వీడియోని మాళవిక సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది.

Bro Movie : బ్రో మూవీకి ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్న అంబటి రాంబాబు? సినిమా మీద ఇంట్రెస్ట్ మరింత పెంచేస్తున్నారు..

ఈ వీడియో షేర్ చేసి మాళవిక.. దేవ్ శ్రీ ఛారిటబుల్ ట్రస్ట్ సుమారు 40 పాఠశాలల (10000-15000) విద్యార్థులకు మద్దతు ఇస్తుంది. ఇటీవల నేను బస చేసిన దేవ్ శ్రీ దేవ్‌గఢ్ బోటిక్ హోమ్‌ స్టే యజమాని శ్రీ శత్రుంజయ్ సింగ్ చుండావత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతను ఎప్పట్నుంచో స్థానిక పాఠశాలలతో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. అతను మరియు అతని కుటుంబం పాఠశాలలకు మద్దతు ఇస్తుంది. ప్రతి సంవత్సరం వారి అవసరాలను వారికి అందజేస్తుంది. నేను ఇవాళ నా వంతు సహాయం చేశాను. విద్యార్థులకు దుస్తులు, పాఠశాల సౌకర్యాలు మరియు వారి ప్రాథమిక అవసరాలకు సహాయం చేయడానికి, మీరు కూడా వారి సోషల్ మీడియా అకౌంట్ లో ఉన్న నంబర్ ద్వారా సంప్రదించవచ్చు అని తెలిపింది. దీంతో అభిమానులు, పలువురు నెటిజన్లు ఆమె చేసిన పనిని అభినందిస్తున్నారు. ఒక హీరోయిన్, లాయర్ అయి ఉండి కూడా అలా పిల్లలకు స్వయంగా చెప్పులు తొడగడాన్ని మెంచ్చుకుంటున్నారు.