Malayalam Star Fahadh Faasil Aparadhi Movie Streaming in Aha OTT
Fahadh Faasil : వేరే భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇటీవల తెలుగులో డబ్బింగ్ అయి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ సినిమా ఒకటి తెలుగులో డబ్బింగ్ అయి రిలీజ్ అయింది. ఫహద్ ఫాజిల్, సౌబిన్ షాహిర్, దర్శన రాజేంద్రన్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన మలయాళం సినిమా ఇరుళ్.
ఇరుళ్ సినిమా ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ అయి అపరాధి పేరుతో నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మిస్టరీ-హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించనుంది. నసీఫ్ యూసుఫ్ ఇజుద్దిన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
భవాని మీడియా ద్వారా ఫహద్ ఫాజిల్ అపరాధి సినిమా ఆహా ఓటీటీలో నేడు మే 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం 91 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సినిమాని ఆహా ఓటీటీలో చూసేయండి.