Manjummel Boys Review : ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు రివ్యూ.. స్నేహం కోసం మిత్రులు చేసిన..

మలయాళ బ్లాక్ బస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి ఈ మూవీ రివ్యూ ఏంటి..?

Malayala super hit movie Manjummel Boys Telugu review and rating

Manjummel Boys Review : ఈ ఏడాది ఫిబ్రవరిలో మలయాళంలో రిలీజయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ‘మంజుమ్మల్ బాయ్స్’. కేవలం 20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 200 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. 2006లో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సౌబిన్ సాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు, గణపతి.. పలువురు మలయాళ యువ నటులు ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇక మలయాళం బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కలిసి తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. నేడు (ఏప్రిల్ 6) థియేటర్స్ లో రిలీజైన ఈ చిత్రం రివ్యూ ఏంటి..?

కథ విషయానికొస్తే..
కేరళలోని కోచికి చెందిన మంజుమ్మల్ బాయ్స్ అనే ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్.. వెకేషన్ కోసం తమిళనాడులోని కొడైకెనాల్ ప్రాంతంలో ఉన్న గుణ కేవ్స్ కి వెళ్తారు. ఈ గుణ కేవ్స్ గురించి చెప్పాలంటే.. కమల్ హాసన్ నటించిన ‘గుణ’ మూవీలోని ‘కమ్మని ఈ ప్రేమ లేఖలే’ సాంగ్ ని అక్కడే షూట్ చేసారు. దీంతో ఆ గుహకి గుణ కేవ్స్ అని పేరు వచ్చింది. అయితే అంతకుముందు ఆ గుహలను ‘డెవిల్ కేవ్స్’ అని పిలిచేవారు.

ఇక ఆ కేవ్స్ చూడడానికి వెళ్లిన మంజుమ్మల్ బాయ్స్ గ్యాంగ్ లోని సుభాష్ (శ్రీనాథ్ బాసి) అనే వ్యక్తి అనుకోకుండా ఒక హోల్ ద్వారా లోయలో పడిపోతాడు. అయితే గతంలో ఆ లోయలో పడిన వారు మళ్ళీ తిరిగి వచ్చిన చరిత్ర లేదు. దీంతో అక్కడి పోలీసులు సుభాష్ కూడా చనిపోయాడు అని భావిస్తారు. కానీ తన ఫ్రెండ్స్ మాత్రం.. సుభాష్ లేనిదే ఇంటికి తిరిగి వెళ్ళేది లేదని స్నేహితుడు కోసం పోరాడతారు. ఆ పోరాటంలో సుభాష్‌ని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నారా..? అసలు లోయలో పడ్డ సుభాష్ ప్రాణాలతో బయటకి వచ్చాడా..? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Also read : Family Star Review : ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ రివ్యూ.. ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిందా?

సినిమా విశ్లేషణ..
నిజ జీవిత కథ కాబట్టి ఎటువంటి ట్విస్ట్ లు లేకుండా కథ ముందుకు సాగుతూ వెళ్తుంది. కానీ ఎక్కడా బోర్ అనే ఫీలింగ్ కలగదు. ఇంటరెస్టింగా తరువాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. దర్శకుడు చిదంబరం ఫ్రెండ్స్ మధ్య సరదా సీన్స్ చాలా నేచురల్ గా తెరకెక్కించారు. అవి చూస్తుంటే.. డైలీ మన లైఫ్ లో మన ఫ్రెండ్స్ తో మన చేసే పనులు గుర్తుకు వస్తాయి. ఆ నేచురాలిటీనే ఆడియన్స్ ని సినిమాకి బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇక ఇన్నాళ్లు తెలుగు వారికి ఒక ప్రేమ స్పాట్ గా తెలిసిన గుణ కేవ్స్‌ని, ఒక డెత్ స్పాట్ చూపించి కొంచెం భయపెట్టారనే చెప్పాలి.

సాంకేతిక అంశాలు..
దర్శకుడు చిదంబరం టేకింగ్, షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ ఆడియన్స్‌ని సీట్ ఎడ్జ్ లో కూర్చునేలా చేశాయి. ఇక ఒక థ్రిల్లర్ సినిమాకి కావాల్సిన నేపథ్య సంగీతంతో పాటు ‘కమ్మని ఈ ప్రేమ లేఖలే’ సాంగ్ ని సన్నివేశానికి తగ్గట్లు డిజైన చేసిన మ్యూజిక్ డైరెక్టర్ సుషిన్ శ్యామ్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

మొత్తంగా ‘మంజుమ్మల్ బాయ్స్’ గురించి చెప్పాలంటే.. స్నేహం కోసం మిత్రులు చేసిన సాహసం. ఫ్రెండ్‌షిప్ పై ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమా మీకు చాలా హై ఇస్తుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్‌తో కలిసి చూసేయండి. ఈ సినిమాకు రేటింగ్ 3 ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

 

ట్రెండింగ్ వార్తలు