Joseph Manu James : సినీ పరిశ్రమలో మరో విషాదం.. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే యువ దర్శకుడు మృతి..

సినీ పరిశ్రమలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మలయాళ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు అకాల మరణం చెందాడు. అయితే ఇక్కడ మరో విషాదకరమైన విషయం ఏంటంటే..

Joseph Manu James : సినీ పరిశ్రమలో మరో విషాదం.. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే యువ దర్శకుడు మృతి..

malayala young director Joseph Manu James passed away before his first directorial movie release

Updated On : February 27, 2023 / 5:06 PM IST

Joseph Manu James : సినీ పరిశ్రమలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెలలోనే సౌత్ లోని పలు ఇండస్ట్రీల్లో పలువురు ప్రముఖులు కన్నుమూసి తీరని శోకాన్ని మిగిల్చి వెళుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో కె విశ్వనాథ్, నందమూరి తారకరత్న, తమిళంలో ప్రముఖ స్టార్ కమెడియన్ మయిల్ సామి, కన్నడ చిత్ర సీమలో అగ్ర దర్శకుడు ఎస్ కె భగవాన్, మలయాళ పరిశ్రమలో ప్రముఖ లేడీ కమెడియన్ మరియు టెలివిజన్ హోస్ట్ సుబీ సురేష్ ఈ నెలలోనే దివిని వదిలి నింగికి ఎగిశారు. తాజాగా మలయాళ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు అకాల మరణం చెందాడు.

K Viswanath Wife passed away : ముగిసిన కె విశ్వనాథ్ సతీమణి అంత్యక్రియలు..

మలయాళ యువ దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ ఫిబ్రవరి 24 రాత్రి కన్నుమూశాడు. గత కొంత కాలంగా హెపటైటిస్‌ (లివర్ సంబంధిత వ్యాధి) తో బాధ పడుతున్న జోసెఫ్ చికిత్స పొందుతూ వస్తున్నాడు. దురదృష్టవశాత్తు 31 ఏళ్ళ వయసులో జోసెఫ్ అందర్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ మరో విషాదకరమైన విషయం ఏంటంటే.. జోసెఫ్ డైరెక్ట్ చేసిన మొదటి మూవీ రిలీజ్ కాకముందే తుదిశ్వాస విడవడం అందర్నీ కలిచి వేస్తుంది.

జోసెఫ్ బాల నటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. 2004లో వచ్చిన ‘ఐ యామ్ క్యూరియస్’ చిత్రంలో బాలనటుడిగా నటించాడు. ఇక దర్శకుడి అవుదామని ప్రయాణం మొదలు పెట్టిన జోసెఫ్.. మలయాళం, కన్నడ మరియు హిందీ చిత్ర పరిశ్రమల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఇక ఇటీవలే దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకొన్న జోసెఫ్.. నాన్సీ రాణి అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ త్వరలో విడుదల కాబోతుంది. ఈలోపే ఇలా జరగడం చిత్ర యూనిట్ ని తీవ్ర వేదనకు గురి చేస్తుంది. కాగా జోసెఫ్ మను జేమ్స్ అంత్యక్రియలు ఈ ఆదివారం నిర్వహించారు.