Top 5 Best 5G Smartphones : రూ.15వేల లోపు ధరలో టాప్ 5 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్‌లు.. ఇలాంటి ఫోన్లు మళ్లీ దొరకవు!

Top 5 Best 5G Smartphones : 5G స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? యువత కోసం టాప్ 5 బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..

1/6Top 5 Best 5G Smartphones
Top 5 Best 5G Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఏదైనా 5G ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. ప్రస్తుత రోజుల్లో 5G ఫోన్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అందరూ 5G సపోర్టు చేసే స్మార్ట్‌ఫోన్‌లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 5G అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. ఎందుకంటే.. స్పీడ్ ఇంటర్నెట్ ఇప్పుడు అందరికీ అవసరమే. అయితే, 5G ఫోన్‌లు ఇప్పుడు రూ. 15వేల లోపు ధరలో అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో మంచి 5G స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్..
2/6Poco X5 5G
పోకో X5 5G : పోకో X5 5జీ ఫోన్ పర్ఫార్మెన్స్, వాల్యూ పరంగా అద్భుతంగా ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వస్తుంది. ప్రతి గేమింగ్ టాస్క్, రోజువారీ టాస్కులకు బెస్ట్. డిస్‌ప్లే కూడా చాలా బాగుంది. ఛార్జింగ్ స్పీడ్ చాలా వేగంగా ఉంటుంది. బడ్జెట్‌లో పవర్‌ఫుల్ ఫోన్‌ కొనుగోలుచేసేవారికి సరైన ఆప్షన్ అని చెప్పవచ్చు.
3/6Samsung Galaxy M14 5G
శాంసంగ్ గెలాక్సీ M14 5G : శాంసంగ్ లాంగ్ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. 6000mAh బ్యాటరీ కలిగి ఉంది. కనీసం ఒకటిన్నర నుంచి రెండు రోజుల వరకు ఛార్జింగ్ వస్తుంది. కెమెరా బాగుంది. ఎప్పటిలాగే, శాంసంగ్ మృదువైన సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
4/6iQOO Z7 5G
ఐక్యూ Z7 5జీ : ఐక్యూ Z7 5జీ ఫోన్ సామర్థ్యం, గేమింగ్ యాక్టివిటీకి బెస్ట్ ఆప్షన్. స్ట్రాంగ్ ప్రాసెసర్, అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉన్నాయి. కెమెరా చాలా బాగుంది. ముఖ్యంగా నైట్ మోడ్‌లో అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు, గేమింగ్ ప్రియులకు సరైన ఆప్షన్.
5/6Realme Narzo 60 5G
రియల్‌మి నార్జో 60 5G : రియల్‌మి నార్జో 60 నేటి యువత కోసం ప్రత్యేకంగా రూపొందించింది. స్పీడ్ ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్, గేమింగ్‌ అందిస్తుంది. అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్‌తో స్టైలిష్‌గా ఉంటుంది. ఆకర్షణీయమైన పర్ఫార్మెన్స్, లుక్స్‌కు సపోర్టు చేస్తుంది.
6/6Redmi Note 13 5G
రెడ్‌మి నోట్ 13 5జీ : ఈ రెడ్‌మి నోట్ 13 5జీ వేరియంట్ పాపులర్ సిరీస్ వెర్షన్. ఈ వెర్షన్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. భారీ అమోల్డ్ డిస్‌ప్లే వీడియో, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగుపరుస్తుంది. కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది.