Aha : ఆహా ఓటీటీలో మలయాళం ‘ఆహా’ సినిమా..

తాజాగా ఆహా ఓటీటీలో మలయాళంలో సూపర్ హిట్ అయిన ఆహా సినిమా రిలీజ్ అయింది.

Malayalam Aaha Movie Dubbed in Telugu OTT Aha

Aha : రెగ్యులర్ గా కొత్త సినిమాలు, షోలు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న తెలుగు ఓటీటీ ఆహాలో ఇటీవల పలు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆహా ఓటీటీలో మలయాళంలో సూపర్ హిట్ అయిన ఆహా సినిమా రిలీజ్ అయింది.

ఇంద్రజిత్ సుకుమారన్, మనోజ్ కె. జయన్, శాంతి బాలచంద్రన్.. పలువురు ముఖ్య పాత్రల్లో బిబిన్ పాల్ శామ్యూల్ దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా మలయాళంలో ‘ఆహా’ సినిమా తెరకెక్కింది. Zsa Zsa ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించారు. 2021లో ఈ సినిమా మలయాళంలో రిలీజ్ అవ్వగా ఇపుడు తెలుగులో డబ్బింగ్ అయి ఆహా ఓటీటీలో భవాని మీడియా ద్వారా రిలీజ్ అయింది.

Also Read : NTR – Vishwak – Siddhu : విశ్వక్, సిద్ధూ జొన్నలగడ్డతో ఎన్టీఆర్ స్పెషల్ దేవర ఇంటర్వ్యూ.. ఫోటో లీక్..

టగ్ ఆఫ్ వార్ గేమ్ నేపథ్యంలో ఈ సినిమా ఆసక్తిగా సాగుతుంది. ఆహా ఓటీటీలో ఈ సినిమా చూసేయండి.