Malayalam actress Manju Warrier buys a bike worth Rs 21 lakh
Actress: సినీ స్టార్స్ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు. వాళ్ళు వాడే కార్లు, ఉండే ఇల్లు, వస్తువులు, బట్టలు కోసం కొన్ని కోట్లు ఖర్చు చేస్తారు. తాజాగా మరో మలయాళ బ్యూటీ కూడా ఒక బైక్ కోసం ఏకంగా రూ.21 లక్షలు ఖర్చు చేసిందట.ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ స్టార్ బ్యూటీ ఆస్తుల చిట్టా కూడా ఒక రేంజ్ లో ఉంది. ప్రస్తుత అంచనా ప్రకారం రూ.142 కోట్ల ఆస్తులను సంపాదించిందట. ఆ స్టార్ బ్యూటీ మరెవరో కాదు మలయాళ ముద్దుగుమ్మ మంజు వారియర్.
మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ లలో ఒకరు(Actress). చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ క్రేజ్ లో మాత్రం తగ్గేదే లే అంటోంది ఈ భామ. కేవలం హీరోయిన్ గానే కాదు, సోషల్ మీడియా క్రేజ్, ఇతర వ్యాపారాలతో ఒక రేంజ్ లో సంపాదిస్తుంది. ఈ అమ్మడు ఒక్కో సినిమాకు రూ.70 లక్షల నుంచి కోటి వరకు ఛార్జ్ చేస్తుందట. కేవలం మలయాళంలోనే కాదు తమిళ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసింది. ధనుష్ తో అసురన్, అజిత్ తో తునీవు, సూపర్ స్టార్ రజినీకాంత్ తో వెట్టయ్యన్ సినిమాలు చేసింది. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని “మానసిలాయో” అనే సాంగ్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాటలో మంజు వేసిన స్టెప్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా అదే సింగ్ వినిపించింది. ఆ రేంజ్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది ఏ బ్యూటీ.
ఇక కేవలం సినిమాలతోనే కాదు, సోషల్ మీడియా ఫేమ్ తో బ్రాండ్ ఎండార్స్మెంట్ కూడా చాలానే చేస్తోంది. ఒక్కో ఎండార్స్మెంట్ కి రూ.75 లక్షల వరకు పారితోషకం తీసుకుంటోంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ బ్యూటీ. నిజానికి, మంజు వారియర్ కి చిన్నప్పటి నుంచి బైక్ లంటే చాలా ఇష్టమట. తాజాగా ఆమె రూ.21 లక్షలు పెట్టి BMW R 1250 GS బైక్ తీసుకున్నారు. ఆ బైక్ పై రైడ్ కి వెళ్లిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.