×
Ad

జ్యోతిక సినిమాను మెచ్చుకున్న విదేశీ మంత్రి

  • Publish Date - September 6, 2019 / 06:23 AM IST

మలేషియా విద్యాశాఖ మంత్రి మస్‌జ్లీ బిన్‌ మాలిక్‌… ప్రముఖ నటి జ్యోతిక సినిమా పై చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల జ్యోతిక లీడ్ రోల్‌ లో నటించిన ‘రాచ్చసి’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో జ్యోతిక ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా అద్భుతంగా నటించింది.    

అయితే ఈ సినిమాను చూసిన మలేషియా మంత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిప్రాయాలను పోస్ట్‌ చేస్తూ.. ‘రెండు నెలల క్రితం ఈ సినిమా విడుదలైంది. రీసెంట్‌ గా ఈ సినిమాను అధికారులతో కలిసి చూశాను. వెంటనే ఈ సినిమా రివ్యూ రాయాలని నిర్ణయించుకున్నా. అందరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. అంతేకాదు కథ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. జ్యోతిక నటన అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.