Malli Modalaindi : ఓటీటీకే ఓటేసిన సుమంత్..

సుమంత్, నైనా గంగూలీ జంటగా నటిస్తున్న ‘మళ్ళీ మొదలైంది’ ఓటీటీలో విడుదల..

Malli Modalaindi

Malli Modalaindi: కొద్దిరోజుల క్రితం ‘సుమంత్ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడొహో!’.. అంటూ సోషల్ మీడియాలో ఇటీవల వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే నెట్టింట్లో ప్రత్యక్షమైన ఆ వెడ్డింగ్ కార్డ్ నిజ జీవితానికి సంబంధించింది కాదని, సుమంత్ నటిస్తున్న ‘మళ్ళీ మొదలైంది’ సినిమా షూటింగ్ కోసం ప్రింట్ చేసిందని ఆ తర్వాత బయటపడింది.

K.G.F 2 : ‘కె.జి.యఫ్ 2’ క్రేజ్ పీక్స్..

సుమంత్, నైనా గంగూలీ, యాంకర్ వర్షిణి సౌందర రాజన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘మళ్ళీ మొదలైంది’.. TG కీర్తి కుమార్ దర్శకుడు. పోసాని, ఘట్టమనేని మంజుల, సుహాసిని, అన్నపూర్ణమ్మ, ‘వెన్నెల’ కిషోర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Akhanda : వన్స్ స్టెప్ ఇన్.. ఓటీటీలో ‘అఖండ’ ఆల్ టైమ్ రికార్డ్!

భార్యతో విడాకులు తీసుకుని రెండో పెళ్లికి ప్రయత్నాలు చేసే క్యారెక్టర్‌లో సుమంత్ కనిపించనున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మేకర్స్ సేఫ్ సైడ్ ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ‘మళ్ళీ మొదలైంది’ కూడా ఓటీటీకే ఓటేసింది. ఫిబ్రవరి 11 నుండి జీ5లో ఈ సినిమా ప్రీమియర్ కానుంది.