Mammootty
Mammootty : మలయాళం సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి ఇప్పుడు కూడా వరుస సినిమాలు తీస్తూ విజయాలు సాధిస్తున్నారు. తాజాగా మమ్ముట్టి తన నెక్స్ట్ సినిమా పాదయాత్ర అనే టైటిల్ తో ప్రకటించారు. అది కూడా మలయాళం స్టార్ రచయిత దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో. దీంతో మమ్ముట్టి సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో చర్చగా మారింది.( Mammootty)
గతంలో మమ్ముట్టి మెయిన్ లీడ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథలో కొంతభాగాన్ని తీసుకొని, ఆయన చేసిన పాదయాత్రని ఆధారంగా తీసుకొని యాత్ర, యాత్ర 2 సినిమాలు తెరకెక్కించారు. యాత్ర సినిమా మంచి విజయం సాధించగా యాత్ర 2 మాత్రం ఆశించిన ఫలితం రాలేదు. తాజాగా పాదయాత్ర అనే పేరుతో సినిమా ప్రకటించడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
Also Read : Divyabharathi : ఆ ఫొటోలు చూసి.. ఆ బట్టలేంటి అంటూ మా అమ్మ ఏడ్చింది.. దివ్యభారతి కామెంట్స్ వైరల్..
రెండు రోజుల క్రితం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాను త్వరలో అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మమ్ముట్టి పాదయాత్ర పేరుతో సినిమా ప్రకటించడంతో చర్చగా మారింది. అయితే ఈ సినిమా మలయాళ దర్శకుడు కావడంతో ఇది మలయాళ సినిమా అని, ఏపీ రాజకీయాలకు సంబంధం ఉండదు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ పాదయాత్ర సినిమా ఎలాంటి సినిమా, ఎవరి కథ తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.
My Next #Padayaatra pic.twitter.com/pMJgJNE2ZY
— Mammootty (@mammukka) January 23, 2026
Also See : Suma Kanakala : 50 ఏళ్ళ వయసులో యాంకర్ సుమ అందంగా.. ఆనందంగా..