Mammootty Jiiva Yatra 2 Movie teaser release date update
Yatra 2 : తమిళ నటుడు జీవా వైఎస్ జగన్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘యాత్ర 2’. 2019 ఎలక్షన్స్ ముందు వైఎస్సార్ బయోపిక్ గా దర్శకుడు మహి వి రాఘవ్.. యాత్ర సినిమాని తీసుకొచ్చారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా, మళ్ళీ ఎలక్షన్స్ ముందు యాత్ర 2 సినిమా తీసుకొస్తున్నారు. మహి వి రాఘవ్ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈ మూవీని త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి పలు ముఖ్య పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఇప్పుడు టీజర్ రిలీజ్ కి డేట్ అండ్ టైం ఫిక్స్ చేశారు. జనవరి 5న ఉదయం 11 గంటలకు ఈ సినిమా టీజర్ రిలీజ్ కి ముహర్తం ఫిక్స్ చేశారు. ఇక ఈ అప్డేట్ ఇస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. వైస్సార్‌లా మమ్ముట్టి కుర్చీలో కూర్చొని కనిపిస్తే, ఆయన పక్కనే జీవా జగన్ పాత్రలో ఒదిగిపోయారు.
Also read : Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ స్క్రిప్ట్ పై సందీప్ వంగ ఏమన్నారంటే..
కాగా ఈ సినిమాని 2024 ఫిబ్రవరి 8న రిలీజ్ చేయబోతున్నారు. వైఎస్సార్ మరణం ముందు, తర్వాత జగన్ పరిస్థితులు, ఆ తరువాత జగన్ సీఎం ఎలా అయ్యారు అనే విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. కాగా ఈ ఇదే పాయింట్ తో ఆర్జీవీ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వడానికి చాలా కష్టపడుతుంది. ఈ మూవీని రిలీజ్ చేయకూడదని టీడీపీ నాయకులు కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే.
ఎన్నికల ముందుకు ఇలాంటి సినిమాలు ప్రజల పై ప్రభావం చూపిస్తాయని, సినిమా విడుదలను అడ్డుకోవాలని టీడీపీ తరుపు న్యాయవాదులు పేర్కొంటున్నారు. మరి వ్యూహం సినిమాలా ‘యాత్ర 2’ రిలీజ్ కి కూడా అడ్డంకులు వస్తాయా అనేది సందేహంగా మారింది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.