Mana shankara varaprasad garu movie achieved breakeven in just six days.
MSVG Collections: మెగాస్టార్ మెగా ర్యాంపేజ్ ఆగడం లేదు. విడుదలై ఆరు రోజులు గడుస్తున్నా ఆ ఊచకోత మాత్రం తగ్గడం లేదు. సెంటర్ తో సంబంధం లేకుండా మన వరప్రసాద్ చేస్తున్న మాస్ జాతరకు కలెక్షన్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయి. కేవలం అయిదు రోజ్జుల్లోనే రూ.199 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే బ్రేకీవెన్ కంప్లీట్ చేసుకొని ఈ సీజన్ లో క్లీన్ హిట్ గా నిలిచింది మన శంకర వరప్రసాద్ గారు(MSVG Collections) సినిమా.
Tere Ishq Mein OTT: ఓటీటీలో బ్లాక్ బస్టర్ ‘తేరే ఇష్క్ మే’.. ధనుష్ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. తెరపై వింటేజ్ లుక్ మెగాస్టార్ చేసిన వీరవిహారానికి చిన్నా, పెద్దా అని తేడా లేకుండా థియేటర్స్ కి పరుగులు పెట్టారు. చోట్ల అదనపు షోలు వేసే పరిస్థితి ఏర్పడింది. సీట్లు సరిపోక వేరే కుర్చీలు వేసుకొని మరీ సినిమా చేస్తున్నారు ప్రేక్షకులు. ఒక సినిమాను ఈ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకోవడం గత కొన్నేళ్లలో ఐదు మొదటిసారి అవడం విశేషం.
ఇక కలెక్షన్స్ విషయంలో కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది మన శంకర వరప్రసాద్ గారు సినిమా. వరుసగా 5వ రోజు ఏపీ అండ్ తెలంగాణలో రూ.15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఆర్ఆర్ఆర్ మూవీ పేరిట ఉన్న రికార్డ్ ను కూడా బ్రేక్ చేసింది ఈ సినిమా. రానున్న రోజుల్లో మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
Mana shankara varaprasad garu movie achieved break-even in just six days.