Kadambari Kiran : నటుడు కాదంబరి కిరణ్ గత కొన్నేళ్లుగా మనం సైతం కాదంబరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవలు, సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మనం సైతం సంస్థ ఆధ్వర్యంలో ష్యూర్ ఆడియో టెక్నాలజీస్ CSR సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. హైదరాబాద్ చిత్రపురి కాలనీలోని ఎల్ఐజీ ప్రాంగణంలో రెనోవా హాస్పిటల్ సహకారంతో మనం సైతం కాదంబరి ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో వందలాది మంది పాల్గొని వైద్య సేవలను పొందారు. ఈ శిబిరంలో కంటి, దంత, బీపీ, హార్ట్, వెయిట్, బీఎంఐ, కాన్సర్, హోమియో, బీఎండీ వంటి వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.
Also Read : Val Kilmer : హాలీవుడ్ స్టార్ కన్నుమూత.. గొంతు క్యాన్సర్ తో బాధపడుతూ.. చివరి సినిమాలో డబ్బింగ్ చెప్పలేక..
ఈ సందర్భంగా మనం సైతం కాదంబరి ఫౌండేషన్ సంస్థ నిర్వహకులు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎవరికైనా మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదు. అందుకే ప్రముఖ ఆస్పత్రుల డాక్టర్లతో కలిసి ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించాము. గత 10 ఏళ్లలో 50 వేల మంది నిస్సాహయులకు మా ఫౌండేషన్ నుంచి సాయం అందించాం. అలాగే సపర్య వదిలేసిన నిస్సాహయులను మేం చేరదీస్తాం, అనాధ, వృద్ధాప్య ఆశ్రమం ప్రారంభించి సేవ చేసుకోవడంమే నా జీవిత లక్ష్యం అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు వినోద్‌బాల మాట్లాడుతూ.. మనం సైతం కాదంబరి ఫౌండేషన్ నుంచి కాదంబరి కిరణ్ ఎన్నో ఏళ్లుగా ఎన్నో సేవలు చేస్తున్నారు. ఆయన టీంలో మేము కూడా ఇలా సేవల్లో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తాం. చిత్రపురి కాలనీలోని కార్మికులకు వైద్య సేవలు అందించడం సంతోషంగా ఉంది అని అన్నారు.