Val Kilmer : హాలీవుడ్ స్టార్ కన్నుమూత.. గొంతు క్యాన్సర్ తో బాధపడుతూ.. చివరి సినిమాలో డబ్బింగ్ చెప్పలేక..
వాల్ కిల్మర్ బ్యాట్ మ్యాన్ ఫరెవర్ సినిమాతో బ్యాట్ మ్యాన్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Hollywood Actor Val Kilmer Passed away with Throat Cancer and Some Health Issues
Val Kilmer : హాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. హాలీవుడ్ స్టార్ నటుడు వాల్ కిల్మర్ కన్నుమూశారు. టాప్ గన్, బ్యాట్ మ్యాన్ ఫరెవర్, వండర్ ల్యాండ్, అలెగ్జాండర్, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, డెజావు, స్ట్రీట్స్ ఆఫ్ బ్లడ్, ది స్నో మ్యాన్, టాప్ గన్ మెవరిక్.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు వాల్ కిల్మర్. సినిమాలతో పాటు పలు సిరీస్ లు, టీవీ షోలలో కూడా నటించాడు.
వాల్ కిల్మర్ బ్యాట్ మ్యాన్ ఫరెవర్ సినిమాతో బ్యాట్ మ్యాన్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్నాళ్లుగా వాల్ కిల్మర్ గొంతు క్యాన్సర్ తో పాటు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో సినిమాలకు దూరమయ్యాడు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాల్ కిల్మర్ చికిత్స తీసుకుంటూ నిన్న ఏప్రిల్ 1న లాస్ ఏంజిల్స్ లోని తన ఇంట్లోనే మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.
Also Read : JAAT : జాట్ నుంచి ఫస్ట్ సాంగ్.. ‘టచ్ కియా’ వచ్చేసింది.. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో..
వాల్ కిల్మర్ చివరి సినిమా టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్ మెవరిక్. 1986 లో వచ్చిన టాప్ గన్ సినిమాలో వాల్ కిల్మర్ ఐస్ మ్యాన్ పాత్ర పోషించాడు. 36 ఏళ్ళ తర్వాత 2022 లో ఈ సినిమాకు టాప్ గన్ మెవరిక్ అని సీక్వెల్ తీశారు. ఇందులో కూడా వాల్ కిల్మర్ పాత్ర కంటిన్యూ ఉంది. అయితే అప్పటికే అతను గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. దీంతో ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పలేకపోవడంతో సోనాటిక్ అనే AI కంపెనీతో టై అప్ అయి తన వాయిస్ ని రీ క్రియేట్ చేయించాడు వాల్ కిల్మర్. ఇందుకోసం బాగానే కష్టపడి బాగానే ఖర్చు కూడా పెట్టారంట. అలా తన చివరి సినిమాలో తాను డబ్బింగ్ చెప్పలేదు వాల్ కిల్మర్. ఆ ఆతర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. వాల్ కిల్మర్ మరణంతో పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు ఆయనకు నివాళులు తెలుపుతున్నారు.