×
Ad

Manaswini : ‘కొక్కోరోకో’ అంటున్న సముద్రఖని.. నటిగా మారుతున్న నృత్యకారిణి..

నీలాద్రి ప్రొడక్షన్ బ్యానర్ పై కొక్కోరోకో సినిమా త్వరలో రిలీజ్ కానుంది.(Manaswini)

Manaswini

Manaswini : సముద్రఖని మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న సినిమా ‘కొక్కోరోకో’. దర్శకుడు రమేష్ వర్మ నిర్మాతగా మారి తన కొత్త బ్యానర్ ఆర్వీ ఫిల్మ్ హౌస్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ వసంతల దర్శకత్వంలో ఐదు విభిన్న పాత్రలతో కూడి, కోడిపందేల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. నీలాద్రి ప్రొడక్షన్ బ్యానర్ పై కొక్కోరోకో సినిమా త్వరలో రిలీజ్ కానుంది.(Manaswini)

అయితే ఈ సినిమాలో కళాకారిణి మనస్విని బాలబొమ్మల నటిగా ఎంట్రీ ఇస్తుంది. తాజాగా సంక్రాంతి పండక్కి ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజయింది. ఈ ఫస్ట్ లుక్ లో ఒక ఫ్యామిలీ అంతా కోడిని పట్టుకొని కూర్చొని ఉన్నారు. ఈ ఫస్ట్ లుక్ లో మనస్విని బాలబొమ్మల కూడా ఉంది. ఈ పోస్టర్‌లో ఆమె సీనియర్ నటుడు సముద్రఖని సహా ఇతర నటులతో కలిసి కనిపించింది.

Also Read : Ram Charan : రామ్ చరణ్ లేటెస్ట్ స్టైలిష్ లుక్స్ చూశారా..? ఏమున్నాడ్రా బాబు.. ఫొటోలు వైరల్..

సినిమాల్లోకి రాకముందే మనస్విని థియటర్ రంగంలో శిక్షణ పొంది అనేక నాటకాలు వేసింది. అలాగే ఆమెకు పెరిని నాట్యం అనే శాస్త్రీయ నృత్యంలో కూడా శిక్షణ ఉంది. కర్ణాటక సంగీతంలో కూడా మనస్విని ప్రావీణ్యం సంపాదించుకుంది. పలు ఈవెంట్స్ లో యాంకరింగ్ కూడా చేసింది. ఇలా నాట్యం, సంగీతం, నాటక నటనలో ప్రావీణ్యం ఉన్న మనస్విని ఇప్పుడు సినిమాల్లో నటిగా ఎంట్రీ ఇస్తుంది.