Aadi Parvam : మంచు లక్ష్మి పాన్ ఇండియా సినిమా ‘ఆదిపర్వం’.. సెన్సార్ పూర్తి..

ఆదిపర్వం సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.

Aadi Parvam : మంచులక్ష్మీ(Manchu Lakshmi) మెయిన్ లీడ్ లో శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, సుహాసిని.. పలువురు ముఖ్య పాత్రల్లో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదిపర్వం’. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ – AI ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కించినట్టు సమాచారం. 800 వందల సంవత్సరాల కథ కలిగిన ఓ అమ్మవారి గుడి చుట్టూ జరిగిన సంఘటనలతో అల్లుకున్న కథ, ఆ అమ్మవారి భక్తురాలి కథగా ఈ ఆదిపర్వం సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఆదిపర్వం సినిమాకు యు/ఎ (U/A) సర్టిఫికెట్ జారీ చేసారు. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు మూవీపై ప్రశంసలు కురిపించారు.

Also Read : Mahesh – Rajamouli : రాజమౌళి సినిమా కోసం మహేష్ ఫిజికల్‌గా.. ఫుడ్ విషయంలో.. సుధీర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. ఆల్రెడీ ఆదిపర్వం ట్రైలర్, పలు సాంగ్స్ రిలీజ్ అయి మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ సినిమాతో దాదాపు రెండు వందలమందికి పైగా కొత్త నటీనటులు తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. అయిదు భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నాం. సెన్సార్ సభ్యులు మా సినిమాని పొగడటంతో రిజల్ట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నాం. త్వరలోనే ఆదిపర్వం రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు