Manchu Lakshmi
Manchu Lakshmi : మంచు ఫ్యామిలీకి విద్యాసంస్థలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. స్కూల్స్, కాలేజీలు ఉన్నాయి. మంచు విష్ణుకి హైదరాబాద్ లో న్యూ యార్క్ అకాడమీ అనే స్కూల్ కూడా ఉంది. ఇది చాలా ఖరీదైన పాఠశాలే. మంచు కుటుంబంలోని పిల్లలు అక్కడే చదువుతారు. అయితే మంచు లక్ష్మి మాత్రం తన కూతురు నిర్వాణ ను మొదట ఆ స్కూల్ లో జాయిన్ చేసినా తర్వాత తీసేసిందట.(Manchu Lakshmi)
తాజాగా మంచు లక్ష్మి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయం తెలిపింది.
Also Read : Samantha : పెళ్ళికి ముందు.. రాజ్ కి గోరింటాకు చూపిస్తూ మురిసిపోతున్న సమంత .. ఫొటోలు వైరల్..
మంచు లక్ష్మి మాట్లాడుతూ.. నా కూతురు మొదట విష్ణు స్కూల్ న్యూ యార్క్ అకాడమీకే వెళ్ళింది. ఆరు నెలలు వెళ్లిన తర్వాత నేనే ఆ స్కూల్ నుంచి తీసేసాను. స్కూల్ అకాడమీ ఇయర్ మధ్యలో ఉన్నప్పుడే తీసేసాను. ఇంట్లో పెద్ద గొడవ జరిగింది ఈ విషయంలో. నేను ఆ స్కూల్ లో ఫీజ్ కూడా కట్టక్కర్లేదు. అక్కడ అందరూ నా కూతురుని చాలా బాగా కేర్ చేస్తారు. ఆమె అక్కడ చాలా బాగుంటుంది ఈ విషయం నాకు తెలుసు. కానీ అక్కడ తనని వేరేలా ఓ రేంజ్ లో చూస్తారు. అందుకే ఆమెను అక్కడ ఓవర్ గా చూడొద్దని తీసేసా.
ఆ తర్వాత గచ్చిబౌలి లో ఒక మాములు స్కూల్ లో జాయిన్ చేశా. స్కూల్ బయట దిగి బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వెళ్తుంది. నా ఫ్రెండ్ ఆ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంది. అక్కడ జాయిన్ చేశా. విష్ణు స్కూల్ లో అయితే కార్ డోర్ తీసేవాళ్ళు, లిఫ్ట్ నొక్కేవాళ్ళు, సెల్యూట్ కొట్టేవాళ్ళు ఒకరు.. ఇలా చిన్న వయసులో ఆ రేంజ్ చూపిస్తే ఇదే నిజం అనుకుంటుంది. అందుకే అవన్నీ తీసేసి మాములు స్కూల్ లో జాయిన్ చేశా అని తెలిపింది. ఈ విషయంలో మాత్రం మంచు లక్ష్మిని అభినందిస్తున్నారు.
Also Read : Samantha : ‘అతని సమస్య నేనే’.. భర్త పై సమంత ఫస్ట్ పోస్ట్ వైరల్..