Samantha : పెళ్ళికి ముందు.. రాజ్ కి గోరింటాకు చూపిస్తూ మురిసిపోతున్న సమంత .. ఫొటోలు వైరల్..

సమంత ఫ్రెండ్స్ వీరి పెళ్ళికి సంబంధించిన మరిన్ని ఫోటోలు మెల్లిమెల్లిగా షేర్ చేస్తున్నారు.(Samantha)

Samantha : పెళ్ళికి ముందు.. రాజ్ కి గోరింటాకు చూపిస్తూ మురిసిపోతున్న సమంత .. ఫొటోలు వైరల్..

Samantha

Updated On : December 4, 2025 / 10:33 AM IST

Samantha : సమంత ఇటీవలే దర్శకుడు రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ కోయంబత్తూర్ లోని ఈషా ఆశ్రమంలో పెళ్లి చేసుకున్నారు. దాదాపు నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు ఈ ఇద్దరూ అనే రూమర్స్ కి వీరి పెళ్లితో క్లారిటీ ఇచ్చేసారు. ఇద్దరికీ ఇది రెండో వివాహమే కావడం గమనార్హం. ఇప్పటికే వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా సమంత ఫ్రెండ్స్ వీరి పెళ్ళికి సంబంధించిన మరిన్ని ఫోటోలు మెల్లిమెల్లిగా షేర్ చేస్తున్నారు.(Samantha)

Also Read : Samantha : ‘అతని సమస్య నేనే’.. భర్త పై సమంత ఫస్ట్ పోస్ట్ వైరల్..

తాజాగా సమంత ఫ్రెండ్ మేఘన వినోద్ ఈ పెళ్లి నుంచి పలు ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో పెళ్ళికి ముందు సమంత గోరింటాకు పెట్టుకోగా ఆ ఫోటోలను రాజా నిడిమోరు కు చూపిస్తూ మురిసిపోతుంది. రాజ్ కూడా ఫోన్ లో గోరింటాకు డిజైన్స్ సమంతకు చూపిస్తున్నాడు. వీరిద్దరూ ఇలా క్యూట్ గా ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Meghna (@meghnavinod)