Manchu Lakshmi : సిద్దార్థ్ వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయింది.. మగ అహంకారం.. మంచు లక్ష్మి వ్యాఖ్యలు వైరల్..

తాజాగా మంచు లక్ష్మి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ సినిమా గురించి మాట్లాడుతూ అది ఎందుకు ఫ్లాప్ అయిందో చెప్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. (Manchu Lakshmi)

  • Published on- April 28, 2026 / 11:59 AM IST

Manchu Lakshmi

Manchu Lakshmi : మోహన్ బాబు కూతురు మంచులక్ష్మీ మొదట హాలీవుడ్ లో సినిమాలు ట్రై చేసి అనంతరం ఇక్కడ తెలుగులో అనగనగా ఓ ధీరుడు సినిమాతో పరిచయం అయింది. ఆ సినిమాలో మంచు లక్ష్మి నెగిటివ్ పాత్రలో విలన్ గా కనిపించింది. ఆ సినిమా చందమామ కథలా కాన్సెప్ట్ బాగున్నా ఫ్లాప్ అయింది. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ దర్శకత్వంలో హాలీవుడ్ సంస్థ డిస్నీ వరల్డ్ నిర్మాణంలో ఆ సినిమా వచ్చింది.

తాజాగా మంచు లక్ష్మి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ సినిమా గురించి మాట్లాడుతూ అది ఎందుకు ఫ్లాప్ అయిందో చెప్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Also Read : Manchu Lakshmi : లక్ష్మి పార్వతి నాకు, అంకుల్‌కి తినిపించేది.. వామ్మో మంచులక్ష్మి ఎన్టీఆర్‌కి ఇంత క్లోజా? ఏం చెప్పిందంటే..

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. అలాంటి పాత్రలు చేయడం ఛాలెంజ్. కానీ ఇవాళ్టికి కూడా నేనొక్కదాన్నే ఇండియన్ ఎవిల్ క్వీన్ డిస్నీలో. దానికి నేను చాలా గర్వపడుతున్నా. మొదట విలన్ గా పరిచయం అవుతున్నాను అనుకున్నాను కానీ ఆర్టిస్ట్ గా పేరొస్తుంది అనుకోని చేశా. అది చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్. ఆ సినిమా క్లైమాక్స్ వల్లే ఫెయిల్ అయింది. క్లైమాక్స్ లో నేను సిద్దార్థ్ తో ఫైట్ చేయాలి. కానీ అలా చేస్తే నాకు పేరొస్తుంది, నేను తనని డామినేట్ చేస్తాను అనే ఓ మగ అహంకారంతో సిద్దార్థ్ అందుకు ఒప్పుకోలేదు.

అందుకే క్లైమాక్స్ లో నేను ఒక వింత జంతువులా మారిపోయి ఫైట్ చేసినట్టు చూపించారు. నేను అప్పుడు ఏమి మాట్లాడలేకపోయాను. క్లైమాక్స్ లో నేనే డైరెక్ట్ ఫైట్ చేసి ఉంటే సినిమా హిట్ అయ్యేది. ఎందుకు అలా చేసారు అని అడిగితే హీరో ఒప్పుకోలేదు అని చెప్పారు. అందరూ నాకు పేరు వచ్చేస్తుంది అని కుళ్ళుకున్నారు. అయినా ఆ సినిమాకు నాకే ఎక్కువ పేరు వచ్చింది. రాఘవేంద్రరావు గారు, ప్రకాష్ సినిమా, సిద్దార్థ్.. వీళ్లంతా ఉన్నారు. నేను ఫస్ట్ టైం తెలుగులో యాక్టింగ్ చేస్తున్నా అందుకే అప్పుడు ఏమి మాట్లాడలేకపోయాను అని చెప్పుకొచ్చింది.

Also See : Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి క్యూట్ ఫొటోలు.. ఎంత అందంగా ఉందో..