×
Ad

Manchu Lakshmi : అవార్డు వేడుకల్లో వ్యక్తిపై చేయి చేసుకున్న మంచు లక్ష్మి.. వీడియో వైరల్

అవార్డు వేడుకల్లో ఒక వ్యక్తి చేయి చేసుకున్న మంచు లక్ష్మి.. అతడిని 'నీ యవ్వ' అంటూ తిట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో..

  • Published On : September 22, 2023 / 07:34 AM IST

Manchu Lakshmi video at SIIMA awards 2023 gone viral

Manchu Lakshmi : మంచు వారసురాలు లక్ష్మి గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వనక్కర్లేదు. టాలీవుడ్ ఆమెకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. కాగా ఈమె అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఒక అవార్డు ఫంక్షన్ లో మంచి లక్ష్మి చేసిన పని నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల దుబాయ్ లో SIIMA అవార్డుల వేడుక జరిగిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లోని పలువురు స్టార్స్ ఆ ఈవెంట్ కి హాజరయ్యి సందడి చేశారు. ఇక ఈ ఈవెంట్ కి మంచు లక్ష్మి కూడా వెళ్ళింది.

Bigg Boss 7 : మూడో వారం నామినేషన్స్‌లో ఉన్నది ఎవరు.. ఈసారి పవర్‌ అస్త్ర..!

ఈ ఈవెంట్ లో ఆమె రెడ్ కార్పెట్ నిలుచొని మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఒక వ్యక్తి కెమెరా ముందు నుంచి వెళ్ళాడు. ఒక పక్క తనని మీడియా ఇంటర్వ్యూ చేస్తుంటే.. ఆ వ్యక్తి కెమెరాకి అడ్డుగా రావడంతో లక్ష్మి అతని పై చెయ్యి చేసుకుంది. అంతేకాదు ‘నీ యవ్వ’ అంటూ తిట్టింది. అయితే ఇంతలోనే ఇంకో వ్యక్తి కూడా కెమెరా ముందు నుంచి వెళ్తుంటే.. ‘కెమెరా వెనుక నుంచి వేళ్ళు డ్యూడ్’ అంటూ చెప్పింది. అయితే ఇదంతా సరదా గానే జరిగింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకి రావడంతో నెట్టింట వైరల్ గా మారింది.

Vijay Antony : కూతురి మ‌ర‌ణం త‌రువాత‌.. మొద‌టి సారి స్పందించిన విజ‌య్ ఆంటోనీ

ఇది ఇలా ఉంటే, తాజాగా మంచు లక్ష్మికి ప్రధానిమంత్రి ఆఫీస్ నుంచి ఆహ్వానం అందింది. ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ మహిళా బిల్లును ఆమోదించిన విషయం అందరికి తెలిసిందే. ఇక దీని గురించి చర్చెందుకు దేశంలోని పవర్ ఫుల్ లేడీస్ ని ఇన్వైట్ చేస్తుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మిని కూడా ఆహ్వానించారు. అయితే ఈ ఆహ్వానం వెనుక రాజకీయ కోణం కూడా ఉంది అంటూ టాక్ వినిపిస్తుంది. ఆమెను రాజకీయాల్లోకి ఆహ్వానించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.