Lakshmi Manchu
Lakshmi Manchu : మంచువారమ్మాయి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఏపీ రాజకీయాలపై ట్వీట్ చేసారు. ఆమె చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Meenakshi Chaudhary : మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి..?
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి. కొందరు వీటిపై స్పందిస్తుంటే.. చాలామంది సెలబ్రిటీలు అక్కడ జరుగుతున్న పరిణామాల్ని ఆసక్తికరంగా పరిశీలిస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మి ట్వీట్ చేసారు. ‘ఏపీ రాజకీయాల్ని చూస్తుంటే ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయంటూ’ మంచు లక్ష్మి ఆసక్తికరమైన ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మంచువారి ఫ్యామిలీలో నటుడు మంచు మోహన్ బాబుకి రాజకీయాలు కొత్తకాదు. గతంలో ఆయన ఎంపీగా ఉన్నారు. తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు. మంచు విష్ణు కూడా బావ..ఏపీ సీఎం జగన్‌కు మద్దతుగా ఉంటారు. మంచు మనోజ్ భార్య టీడీపీ అన్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ ఇటు టీడీపీతో ఉంటూనే అటు పవన్‌తో సాన్నిహిత్యంగా ఉంటారు. మంచు లక్ష్మి మాత్రం ఏ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ఎప్పుడూ కనిపించలేదు. ఇక మంచు లక్ష్మి ట్వీట్‌పై నెటిజన్లు రియాక్టవుతూ మీరే పార్టీకి మద్దతు ఇస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. మంచు లక్ష్మి దీనిపై స్పందించాల్సి ఉంది.
మంచు లక్ష్మి ప్రస్తుతం తండ్రి మోహన్ బాబుతో కలిసి ‘అగ్ని నక్షత్రం’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు, మంచు లక్ష్మి నిర్మిస్తున్నారు. సముద్రఖని, విశ్వంత్, చిత్ర శుక్లా, మళయాళ నటుడు సిద్ధిక్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
Woah!!! AP politics just got super interesting..
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) September 15, 2023