Meenakshi Chaudhary : మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి..?

మీనాక్షి చౌదరి టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటుంది. తాజాగా..

Meenakshi Chaudhary : మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి..?

Meenakshi Chaudhary got heroine offer in Dulquer Salmaan Lucky Baskhar

Updated On : September 15, 2023 / 12:29 PM IST

Meenakshi Chaudhary : టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి వరుస ఆఫర్లు అందుకుంటుంది. ‘ఇచట వాహనాలు నిలపరాదు’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అడవి శేష్ ‘హిట్’తో రీసెంట్ గా సూపర్ హిట్టుని అందుకుంది. ఇక ఆ తరువాత నుంచి క్రేజీ ఆఫర్స్ ని అందుకుంటూ వస్తుంది. ముందుగా మహేష్ బాబు ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) హీరోయిన్ ఛాన్స్ అందుకొని బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆ తరువాత విశ్వక్ సేన్, వరుణ్ తేజ్ సినిమాల్లో కూడా అవకాశం అందుకుంది. ఇప్పుడు మరో సూపర్ ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం.

Devil : కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ మూవీ దర్శకనిర్మాతల మధ్య విబేధం.. ట్వీట్ వైరల్!

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘లక్కీ భాస్కర్’ అనే టైటిల్ ని పెట్టారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా మీనాక్షిని సెలెక్ట్ చేశారని ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదుగాని, నిజమైతే మీనాక్షి బంపర్ ఆఫర్ కొట్టినట్లే. అక్టోబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కాబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు.

Shruti Haasan : సేల్స్ గర్ల్‌గా పని చేయాలని అనుకున్నా.. కానీ నటిని అయ్యాను..

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఇటీవల వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘సార్’ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో ఈ మూవీ పై అనౌన్స్‌మెంట్ తోనే అంచనాలు క్రియేట్ అయ్యాయి. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీ రిలీజ్ చేయనున్నారు. మరి సార్ సినిమా మ్యాజిక్ ని మళ్ళీ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ ని అందుకుంటారా? లేదా? చూడాలి.