Manchu Manoj : నేను ఏ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడలేదు.. నా స్పీచ్ తప్పుగా అర్ధం చేసుకున్నారు..

టీవల రెండు రోజుల క్రితం మోహన్ బాబు పుట్టిన రోజు, మోహన్ బాబు యూనివర్సిటీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లో మంచు మనోజ్ పాల్గొన్నాడు.

Manchu Manoj gives Clarification on his Speech at Mohan Babu Birthday Event

Manchu Manoj : మంచు మనోజ్ చాలా కాలం తర్వాత మళ్ళీ మీడియాలో, బుల్లితెరపై కనిపిస్తున్నాడు. త్వరలోనే సినిమాతో కూడా వస్తాడు. ఇటీవల రెండు రోజుల క్రితం మోహన్ బాబు పుట్టిన రోజు, మోహన్ బాబు యూనివర్సిటీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లో మంచు మనోజ్ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో మనోజ్ మాట్లాడుతూ.. మోహన్ బాబు గురించి, ఆ విద్యాసంస్థల గురించి, అందరూ కలిసి ఉండాలని, అందరితో మంచిగా ఉండాలని చెప్తూనే త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఆలోచించి, ఎవరు మంచి చేసారు, ఎవరు చేయలేదు చూసి ఓట్ వేయండి అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ వ్యాఖ్యలు ఓ పార్టీకి సపోర్ట్ గా, ఇంకో పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని కొంతమంది సోషల్ మీడియాలో విమర్శించారు.

Also Read : RC 16 Movie : రామ్ చరణ్ RC16 విలన్ అతనేనా? 11 ఏళ్ళ తర్వాత ఆ బాలీవుడ్ స్టార్‌తో చరణ్.. ?

దీనిపై మంచు మనోజ్ స్పందిస్తూ.. ఇటీవల మా నాన్న పుట్టిన రోజు వేడుకలో నేను మాట్లాడిన మాటలు కొంతమంది తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. నేను అందరూ కలిసి ఉండాలనే కోరుకుంటాను. ప్రోగ్రాం లైవ్ స్ట్రీమింగ్ లో టెక్నికల్ సమస్యల వల్ల నేను మాట్లాడిన కొన్ని మాటలు కూడా కట్ అయ్యాయి. దీంతో నేను మాట్లాడింది తప్పుగా అర్ధం చేసుకున్నారు. నా మొత్తం స్పీచ్ టెలికాస్ట్ అవ్వలేదు. నేను ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కానీ ఏ ఒక్క పార్టీని కానీ లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయలేదు. నా కుటుంబం తరపున అన్ని పార్టీలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. సాంకేతిక లోపం వల్ల నేను మాట్లాడింది మొత్తం టెలికాస్ట్ అవ్వలేదని టెక్నికల్ టీం చెప్పి సారీ చెప్పారు. నా ఫుల్ స్పీచ్ ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాను. సినిమా ద్వారా ఒక నటుడిగా అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే నా లక్ష్యం. నేను వసుదైక కుటుంబం అని మా నాన్న నేర్పించిన కాన్సెప్ట్ ని నమ్ముతాను. నాకు సపోర్ట్ గా ఉన్నవారందరికి ధన్యవాదాలు అని తెలుపుతూ ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. దీంతో మనోజ్ పోస్ట్ వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు