Aishwarya Rai: నాపేరును వాడుకునే హక్కు ఎవరికీ లేదు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్య

నటి ఐశ్వర్య రాయ్​ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు(Aishwarya Rai). అనుమతి లేకుండా తన ఫొటోలను వాడుతున్నారని, తన వ్యక్తిగత హక్కులను కాపాడాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

Aishwarya Rai: నాపేరును వాడుకునే హక్కు ఎవరికీ లేదు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్య

Aishwarya moves High Court to stop using her photos without permission

Updated On : September 9, 2025 / 1:53 PM IST

Aishwarya Rai: నటి ఐశ్వర్య రాయ్​ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన ఫొటోలను, వీడియోలను వాడుతున్నారని, తన వ్యక్తిగత హక్కులను కాపాడాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు ఐశ్వర్య. కొంత మంది వ్యక్తులు తన పేరును, చిత్రాలు ఏఐ ఆధారిత అశ్లీల కంటెంట్​ క్రియేట్ చేస్తున్నారని, అలాంటివి జరుగకుండా నిరోధించాలని(Aishwarya Rai) ఆమె కోరారు.

Sivakarthikeyan: ఈ రేట్లతో రూ.1000 కోట్లు కొట్టడం కష్టమే.. శివ కార్తికేయన్ కామెంట్స్ వైరల్

ఈ విషయంలో నటి ఐశ్వర్య రాయ్ తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ సందీప్‌ సేథీ వాదనలు వినిపించారు. ‘పూర్తిగా అసత్యమైన, సన్నిహితమైన, అశ్లీమైన ఫొటోలు ఇంటర్నెట్‌లో ప్రచారం అవుతున్నాయి. నిజానికి ఐశ్వర్య ఫొటోలను, పేరును వాడుకునే హక్కు ఎవరికీ లేదు. ఎవరో తెలియని వక్తి ఇలా ఆమె పేరు, ఫొటోలతో డబ్బు సంపాదించడం, ఆమె పేరును, ఇమేజులను ఇష్టానుసారం వాడటం దురదృష్టకరం.. అని పేర్కొన్నారు.