Sivakarthikeyan: ఈ రేట్లతో రూ.1000 కోట్లు కొట్టడం కష్టమే.. శివ కార్తికేయన్ కామెంట్స్ వైరల్

తమిళ స్టార్ శివ కార్తికేయన్(Sivakarthikeyan) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మదరాసి. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Sivakarthikeyan: ఈ రేట్లతో రూ.1000 కోట్లు కొట్టడం కష్టమే.. శివ కార్తికేయన్ కామెంట్స్ వైరల్

Sivakarthikeyan's interesting comments on Tamil cinema not joining the 1000 crore club

Updated On : September 9, 2025 / 1:01 PM IST

Sivakarthikeyan: తమిళ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మదరాసి. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తమిళ సినిమాలు రూ.1000 కోట్ల క్లబ్ లో చేరకపోవడానికి గల కారణాలను వివరించాడు(Sivakarthikeyan) శివ కార్తికేయన్.

Sai Marthand: ఎన్టీఆర్ తో తాత.. మౌళితో మనవడు.. 35 ఏళ్ళ తరువాత తాత పేరు నిలబెట్టాడు

తమిళ సినిమాలు మరికొన్నేళ్లలో రూ.1000 కోట్లు కలెక్షన్లు సాధిస్తాయని నేను నమ్ముతున్నాను. ఇప్పటికే మంచి హైప్ తో వచ్చిన చాలా తమిళ చిత్రాలు ఆ మార్క్‌ని అందుకోలేకపోయాయి. స్టోరీలో నాణ్యత లేకపోవడమో, పాన్ ఇండియా సబ్జెక్ట్ కాకపోవడం ఎదో ఒక కారణం అయ్యుంటుంది. మూవీ క్వాలిటీ విషయం పక్కన పెడితే టికెట్ రేట్లు కూడా తమిళనాడులో చాలా వరకు తక్కువగానే ఉంటాయి.

బెంగళూరు, ముంబైలో ఉన్నట్లుగా ఇక్కడ ఉండి ఉంటే జైలర్‌ సినిమా పక్కా రూ.800 నుంచి రూ.1000 కోట్లు సాధించేది. అలా అని టికెర్ట్ రేట్లు పెంచమని అడగడం లేదు. మా సినిమాలు ఉత్తరాది ప్రేక్షకుల వరకు చేరాలని నా అభిప్రాయం. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.