Manchu Manoj : వివాదం పక్కన పెట్టి.. ‘కన్నప్ప’ కోసం మంచు మనోజ్ స్పెషల్ పోస్ట్.. విష్ణు పిల్లల పేర్లు ప్రస్తావిస్తూ..

ఈ క్రమంలో అన్నతో ఉన్న వివాదం కాస్తా పక్కనపెట్టి మనోజ్ కన్నప్ప కోసం స్పెషల్ పోస్ట్ చేసాడు.

Manchu Manoj Special Post on Kannappa Mentioned Vishnu Children

Manchu Manoj : గత కొన్నాళ్లుగా మంచు మనోజ్ – మంచు విష్ణు మధ్య వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మనోజ్ డైరెక్ట్ గానే తన అన్న విష్ణు మీద ట్విట్టర్లో విమర్శిస్తూ ట్వీట్స్ చేసాడు. మీడియా ముందు కూడా విష్ణు పై కామెంట్స్ చేసాడు. కన్నప్ప సినిమా గురించి కూడా పలుమార్లు ట్రోల్ చేసాడు మనోజ్. మంచు విష్ణు భారీగా తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా రేపు జూన్ 27 విడుదల అవుతుంది. ఈ క్రమంలో అన్నతో ఉన్న వివాదం కాస్తా పక్కనపెట్టి మనోజ్ కన్నప్ప కోసం స్పెషల్ పోస్ట్ చేసాడు.

కన్నప్ప సినిమా నుంచి మోహన్ బాబు, మంచు విష్ణు పిల్లలు అరి, వివి, అవ్రామ్‌ ల ఫోటోలను షేర్ చేస్తూ.. కన్నప్ప మూవీ యూనిట్ కి ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమా కోసం మా నాన్న, ఆయన టీమ్‌ ఎన్నో ఏళ్లు కష్టపడింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా లిటిల్‌ ఛాంప్స్‌ అరి, వివి, అవ్రామ్‌ల అందమైన జ్ఞాపకాలను బిగ్‌ స్క్రీన్‌పై చూడాలని ఎదురుచూస్తున్నాను. తనికెళ్ల భరణిగారి జీవితకాల కల జీవం పోసుకుని శుక్రవారం విడుదల కాబోతుండటం సంతోషంగా ఉంది. మంచి మనసున్న ప్రభాస్‌ గారు, లెజెండరీ నటులు మోహన్‌లాల్‌ గారు, అక్షయ్‌కుమార్‌ గారు, ప్రభుదేవా గారు ఇలా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు. వీళ్లంతా ఈ సినిమా కోసం చేసిన సాయం, చూపించిన ప్రేమ, నమ్మకం ఎంతో గొప్పవి. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఎదురు చూస్తున్నాను. కన్నప్ప ప్రయాణానికి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేసాడు మనోజ్.

Also Read : NTR : అప్పుడే ప్రిపేర్ అయిపోతున్న ఎన్టీఆర్.. చేతిలో ఉన్న బుక్ ఏంటో తెలుసా?

మనోజ్ ఇంత పాజిటివ్ గా కన్నప్ప గురించి పోస్ట్ చేయడం, కన్నప్ప హిట్ అవ్వాలని కోరుకోవడం, మంచు విష్ణు పిల్లల పేర్లు కూడా చెప్పడం, అందరి గురించి ప్రస్తావించి విష్ణు పేరు ఎక్కడా చెప్పకపోవడంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మరోసారి మనోజ్ తన కన్నప్ప ట్వీట్ తో వైరల్ అవుతున్నాడు.

 

Also Read : Laya Daughter Sloka : లయ కూతురు ‘శ్లోక’.. బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు..