Manchu Vishnu Comments on Kannappa Movie Business
Manchu Vishnu : మంచు విష్ణు భారీగా, స్టార్ కాస్ట్ పెట్టి తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు కన్నప్ప బిజినెస్ గురించి మాట్లాడారు.
మంచు విష్ణు మాట్లాడుతూ.. కన్నప్ప సినిమాకు 200 కోట్ల లోపు బడ్జెట్ అయింది. ఈ సినిమా నా సొంత డబ్బు, బ్యాంక్ అప్పులు, లోన్స్ తోనే చేశాను. యూనివర్సిటీ డబ్బులు ఏమి వాడలేదు. అది ట్రస్ట్ కింద ఉంది. వాడితే నన్ను జైలు లో వేస్తారు. ఒక బాంబే కంపెనీ దగ్గరికి వాళ్ళు పిలిస్తే మాట్లాడటానికి వెళ్ళాను నార్త్ థియేట్రికల్ రిలీజ్ కోసం. వాళ్ళు మేము అడ్వాన్స్ లు ఇవ్వము అని చెప్పారు. నేను నిన్ను, నీ కంపెనీ నమ్ముకొని సినిమా తీయలేదు. నా ఆస్తులు, నా క్రెడిబిలిటీ తాకట్టు పెట్టుకొని సినిమా తీస్తున్నాను. మీరొచ్చి నన్ను కాపాడతారని నేను సినిమా తీయలేదు. మీరు డిస్ట్రిబ్యూట్ చేయకపోయినా పర్లేదు. మీ డబ్బు కోసం నేను వచ్చానంటే మీ దగ్గర్నుంచి ఒక్క రూపాయి కూడా నాకు వద్దు అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళ CEO నుంచి వచ్చి సారి చెప్పి వెళ్లారు. కానీ నేను అక్కడ్నుంచి వచ్చేసాను.
Also See : Arjun Das – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో అర్జున్ దాస్.. OG షూట్ గ్యాప్ లో ఫొటోలు..
ఓటీటీకి వెళ్తే వాళ్ళు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. ఓటీటీ డీల్ అయిపోయింది. కానీ సినిమా హిట్ అయితే ఎంత ఇస్తారు అని అడిగాను, వాళ్ళు ఒక నంబర్ చెప్పారు. అయితే చెక్ రెడీ చేసి పెట్టుకోండి అన్నాను. ఓటీటీలో 8 నెలలు గ్యాప్ తర్వాతే వస్తుంది. శాటిలైట్ ఛానల్స్ తో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ డీల్ చేయడానికి ఒక సేల్స్ కంపెనీని పెట్టుకున్నాను. వాళ్ళు ముందు ఉండి మాట్లాడతారు. నేను ఫైనల్ చేస్తాను అని తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో డైరెక్ట్ విష్ణునే రిలీజ్ చేస్తాడని సమాచారం. దీంతో మంచు విష్ణు కామెంట్స్, కాన్ఫిడెన్స్ చూస్తుంటే కన్నప్ప బిజినెస్ బాగానే అయిందని తెలుస్తుంది.
Also Read : Pawan Kalyan : OG షూట్ నుంచి స్పెషల్ ఫొటోలు వైరల్.. పవన్ కళ్యాణ్ తో తమిళ్ స్టార్ అర్జున్ దాస్..