Manchu Vishnu counter tweet to who trolls RRR Movie
Manchu Vishnu : RRR సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మన అందరికి తెలిసిందే. దేశ విదేశాల్లో ఈ సినిమా గురించి దర్శకుడు రాజమౌళి గురించి నేటికీ పొగుడుతూనే ఉన్నారు. ఇక ఈ సినిమాకి ఆస్కార్ వస్తుందని అంతా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మన దేశం నుంచి RRR సినిమాని ఆస్కార్ ఎంట్రీకి పంపకపోయినా జనరల్ కేటగిరిలో RRR సినిమాని 15 విభాగాల్లో అప్లై చేశారు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు రావాలని అంతా కోరుకుంటున్నారు.
అయితే సినిమాల విషయంలో మాత్రం తమిళ్, తెలుగు ప్రేక్షకులకి ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. సోషల్ మీడియాలో అయితే ఒకరి సినిమాలపై ఒకరు, ఒకరి హీరోలపై ఒకరు దారుణంగా ట్రోల్స్ చేసుకుంటారు. RRR సినిమా సాధించిన విజయాన్ని కొంతమంది తమిళ్ నెటిజన్లు ఓర్వలేక సోషల్ మీడియాలో RRR మీద కూడా ట్రోల్స్ చేస్తున్నారు.
Anasuya : అమెరికాలో బతుకమ్మ వేడుకలు.. సందడి చేసిన అనసూయ, మంగ్లీ..
ఇటీవల మంచువిష్ణు RRR సినిమాకి ఆస్కార్ రావాలని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దీనికి సమాధానంగా ఓ తమిళ్ నెటిజన్.. ఆస్కార్ కేటగిరీల్లో బెస్ట్ చెత్త సినిమా అవార్డు కేటగిరి ఉందా? ఉంటే అది RRR సినిమాకి కచ్చితంగా వస్తుంది అని పోస్ట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ కి మంచు విష్ణు కౌంటర్ ఇచ్చాడు. ఇండియన్ సినిమాగా దాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు. ఇది రీజనల్ కి సంబంధించిన గొప్పతనం కాదు, దేశానికి సంబంధించిన గొప్పతనం అని ఆ తమిళ నెటిజన్ కి రిప్లై ఇవ్వడంతో విష్ణు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ కి పలువురు తెలుగు, తమిళ్ నెటిజన్లు ఒక్కో విధంగా రిప్లైలు ఇస్తున్నారు.
Why don’t we celebrate Indian cinema my brother? Now it ain’t about regional pride but national pride. https://t.co/81kNIXgRMQ
— Vishnu Manchu (@iVishnuManchu) October 9, 2022