Manchu Vishnu : టాలీవుడ్ లో ఉన్న హీరో హీరోయిన్స్ అందరికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఈ విషయాన్ని గతంలో నాని, రానా, మంచు లక్ష్మి.. పలువురు నటీనటులు తెలిపారు. ఆ గ్రూప్ లో టాలీవుడ్ లో నటించే చాలామంది నటీనటులు ఉంటారు. దాదాపు 140 మంది యాక్టర్స్ ఆ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారట. ఆ గ్రూప్ ని రానా – అల్లు అర్జున్ కలిసి ప్రారంభించారు.
ఆ గ్రూప్ లో సినిమాల గురించి, ఎవరికి వారు వాళ్ళు తీసిన సినిమాల అప్డేట్స్ గురించి పంచుకుంటారు. తాజాగా ఆ వాట్సాప్ గ్రూప్ గురించి మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ వాట్సాప్ గ్రూప్ గురించి అడగ్గా మంచు విష్ణు దీనిపై సమాధానమిచ్చారు.
Also Read : Kuberaa : ఒకే సినిమా.. తమిళ్ – తెలుగు రెండు భాషల్లో రెండు వెరియేషన్లు.. సినిమా నిడివి కూడా వేర్వేరు..
మంచు విష్ణు మాట్లాడుతూ.. రానా, బన్నీలు ఆ వాట్సాప్ గ్రూప్ ప్రారంభించారు. నేను కూడా ఒకప్పుడు ఆ గ్రూప్ లో ఉండేవాడిని. ఆ గ్రూప్ లో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. దాంతో నాకు ఆ గ్రూప్ లో చాట్ చేయాలంటే చాలా సిగ్గుగా అనిపించేది. అందుకే టాలీవుడ్ వాట్సాప్ గ్రూప్ నుంచి బయటకు వచ్చేసాను. ఏదైనా ఉంటే నాకు పర్సనల్ గా మెసేజ్ చేయమని రానా, బన్నీలకు చెప్పాను. మేమంతా కలిసే పెరిగాం. ఎవరి ఏ అవసరం వచ్చినా ఒక ఫోన్ కాల్ తో కలిసిపోతాం అని తెలిపారు.