Manchu Vishnu : ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు తొలి సంతకం ఈ ఫైల్ పైనే…

ఇవాళ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. 'మా' మాజీ అధ్యక్షుడు నరేష్ నుంచి నూతన బాధ్యతలను తీసుకున్నాడు విష్ణు.

Manchu Vishnu : ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు తొలి సంతకం ఈ ఫైల్ పైనే…

Vishnu

Updated On : October 13, 2021 / 3:22 PM IST

Manchu Vishnu :  ఎన్నో వివాదాల మధ్య ‘మా’ ఎలక్షన్స్ ముగిశాయి. రిజల్ట్స్ కూడా వచ్చాయి. కానీ వివాదాలు మాత్రం ఇంకా ఆగట్లేదు. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చాక కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. నిన్న ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వాళ్లంతా రాజీనామాలు చేసారు. అయినా ఇవేమి పట్టించుకోకుండా ఇవాళ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేష్ నుంచి నూతన బాధ్యతలను తీసుకున్నాడు విష్ణు.

MAA Elections 2021 : విష్ణుని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే బాగోదు : నరేష్

మొదటి రోజు నుంచే తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. తాను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని చెప్పి ‘మా’ అధ్యక్షుడిగా తన తొలి సంతకం పెన్షన్‌ ఫైల్‌పై చేశారు. తాను అధ్యక్షుడిగా గెలిస్తే పేద సీనియర్ కళాకారులకి ఇచ్చే పెన్షన్ పెంచుతానని ప్రకటించాడు. ఇప్పుడు తన మొదటి సంతకం ఆ ఫైల్ పైనే పెట్టడం విశేషం. ‘మా’ అధ్యక్షుడిగా తాను బాధ్యతలు తీసుకున్నట్లు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. ‘మీ సమస్యలు నాకు తెలియజేయండి. మీ మద్ధతు నాకు కావాలి’ అంటూ మంచు విష్ణు ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతే కాక హడావిడి, ప్రెస్ మీట్స్ లేకుండానే ఈ తతంగం పూర్తి చేయడం గమనార్హం. మరి మిగిలిన కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుందనేది ఇంకా వెల్లడించలేదు.