Prabhas – Kannappa : ‘కన్నప్ప’ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడో తెలుసా? ప్రభాస్ వస్తున్నాడా?

కన్నప్ప భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.

Manchu Vishnu Kannappa Grand Pre Release Event Details Prabhas will Grace Event

Prabhas – Kannappa : మంచు విష్ణు దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమాని సొంత బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, మోహన్ బాబు.. ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్లు, సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు నెలకొల్పారు.

కన్నప్ప పాన్ ఇండియా సినిమా కావడంతో దేశంలోని పలు నగరాల్లో ప్రమోషన్స్ చేసారు. ఇప్పటికే కొచ్చి, బెంగళూరు, రాజస్థాన్, ముంబై, గుంటూరు, చెన్నై నగరాల్లో ఈవెంట్స్ నిర్వహించారు. ఇప్పుడు కన్నప్ప భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.

Also Read : Satya Sri : చిరంజీవిని సెల్ఫీ అడిగాను.. ఆయన ఈవెంట్ అంతా అయ్యాక నా దగ్గరికి వచ్చి మరీ.. ఏడ్చేసాను..

కన్నప్ప గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో జూన్ 21 శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నట్టు సమాచారం వచ్చింది. ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు, మీడియాకు ఆహ్వానం అందినట్టు తెలుస్తుంది. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ అంతా హాజరవుతారంట. అలాగే పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరవనున్నారు.

అయితే ముంబై ఈవెంట్ కి అక్షయ్ కుమార్, కొచ్చి ఈవెంట్ కి మోహన్ లాల్, బెంగుళూరు ఈవెంట్ కి శివన్న వచ్చారు కాబట్టి హైదరాబాద్ ఈవెంట్ కి ప్రభాస్ గెస్ట్ గా వస్తాడని భావిస్తున్నారు. విష్ణు కూడా ప్రభాస్ ని ఈవెంట్ కి తీసుకొస్తాను అని గతంలో ఇంటర్వ్యూలో తెలిపాడు. సినిమాలో ప్రభాస్ ఆల్మోస్ట్ అరగంట సేపు కనిపించబోతున్నాడు. ప్రభాస్ ఎలాగో ఇప్పుడు హైదరాబాద్ లోనే షూటింగ్ లో ఉన్నాడు కాబట్టి శనివారం సాయంత్రం షూట్ అయ్యాక కన్నప్ప ఈవెంట్ కి హాజరవుతాడని మంచు ఫ్యామిలీ సన్నిహితుల సమాచారం. ప్రభాస్ ఈవెంట్ కి వస్తే ఫ్యాన్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది. సినిమాపై అంచనాలు కూడా మరింత పెరుగుతాయి.

Also See : Akhil Sarthak – Rithu Chowdary : తిరుమలలో అఖిల్ సార్థక్ – రీతూ చౌదరి జంటగా.. ఫొటోలు వైరల్..