Kannappa : ‘కన్నప్ప’ సినిమా ఇప్పుడు డైరెక్ట్ యూట్యూబ్లో చూడొచ్చు.. బంపర్ ఆఫర్ ఇచ్చిన మంచి విష్ణు..
ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుండగా మంచి విష్ణు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. (Kannappa)
Kannappa
Kannappa : మంచు విష్ణు మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మధుబాల, మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్, ప్రీతీ ముకుందన్.. పలువురు స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. కన్నప్ప సినిమా పాన్ ఇండియా వైడ్ గత సంవత్సరం జూన్ 27 రిలీజయింది మంచి విజయం సాధించింది.
ఇటీవల కన్నప్ప రిలీజయి సంవత్సరం అయినందుకు మరోసారి థియేటర్స్ లో జూన్ 27న రీ రిలీజ్ చేసారు. ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి క్లైమాక్స్ లో కన్నీళ్లు పెట్టించింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కూడా నటించడంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుండగా మంచి విష్ణు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు.
Also Read : Ramji Dott : మొన్న మిరాయ్.. ఇప్పుడు రావు బహదూర్.. తెలుగులో సరికొత్త VFX అందిస్తున్న రాంజీ..
సాధారణంగా కొత్త సినిమాలు చాలా ఏళ్లకు కానీ యూట్యూబ్ లోకి రావు. కానీ కన్నప్ప సినిమాని రిలీజ్ అయిన సంవత్సరంలోనే అందరికి అందుబాటులో ఉండాలని విష్ణు యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు. కన్నప్ప సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ప్రస్తుతం అవా ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ చానెల్లో అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ సినిమా మంచి వ్యూస్ దక్కించుకుంది. ఇంత త్వరగా యూట్యూబ్ లో కన్నప్ప సినిమా అప్లోడ్ చేయడంతో మంచు ఫ్యాన్స్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ లో కన్నప్ప సినిమా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.
