Manchu Vishnu : వామ్మో.. మంచు విష్ణు దగ్గర అన్ని కోట్ల ఆర్ట్ కలెక్షన్ ఉందా..? ఒక ఆర్ట్ లైబ్రరీ మెయింటైన్ చేస్తూ..

ఈ క్రమంలో తన దగ్గరున్న ఆర్ట్ కలెక్షన్స్ గురించి తెలిపాడు మంచు విష్ణు.

Manchu Vishnu Tells About his Huge Art Collection in Kannppa Promotions

Manchu Vishnu : మంచు విష్ణు కన్నప్ప సినిమా జూన్ 27 రిలీజ్ అవుతుండగా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేస్తున్నారు. ఈ క్రమంలో తన దగ్గరున్న ఆర్ట్ కలెక్షన్స్ గురించి తెలిపాడు.

మంచు విష్ణు మాట్లాడుతూ.. నాకు ఆర్ట్స్ అంటే ఇష్టం. నా దగ్గర చాలా పెయింట్ ఆర్ట్స్ ఉన్నాయి. నా దగ్గర ఉన్న ఆర్ట్ వర్క్ కలెక్షన్ విలువ దాదాపు 25 కోట్లు ఉంటుంది. మోహన్ బాబు యూనివర్శిటిలో ఒక ఆర్ట్ లైబ్రరీ ఉంటుంది. నేను కలెక్ట్ చేసిన ఆర్ట్స్ అన్ని అక్కడే ఉంటాయి. 2014 లోనే 4 లక్షలు ఇచ్చి ఒక ఫేమస్ ఢిల్లీ ఆర్టిస్ట్ నుంచి పెయింట్ ఆర్ట్ కొన్నాను. పీఎం మోడీ గారికి కూడా మన తెలుగు ఆర్టిస్ట్ గీసిన ఒక ఆర్ట్ ని గిఫ్ట్ గా ఇచ్చాను. విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా ఆ ఆర్ట్ లైబ్రరీ నడిపిస్తున్నాను. కొన్ని ఆర్ట్స్ ని వేలంపాట వేసి వచ్చిన డబ్బులతో పేద విద్యార్థులను చదివిస్తాను. నేను రెగ్యులర్ గా ఆర్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను అని తెలిపారు.

Also Read : Manchu Vishnu : మీ దగ్గర్నుంచి ఒక్క రూపాయి కూడా వద్దు.. నార్త్ వాళ్లకు కౌంటర్ ఇచ్చిన విష్ణు.. కన్నప్ప బిజినెస్ గురించి కామెంట్స్..

దీంతో మంచు విష్ణు దగ్గర ఈ మంచి అలవాటు కూడా ఉండి అని అభినందిస్తూనే అన్ని కోట్ల ఆర్ట్ వర్క్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.