Manchu Vishnu : ఇంత మంచోడివి ఏంటి భయ్యా.. ఎంత నెగిటివిటీ చూపించినా పాజిటివ్ గా మంచు విష్ణు.. ట్వీట్ వైరల్..

డైరెక్ట్ గా ట్రోల్ చేస్తూ ప్రశ్నలు అడిగినా మంచు విష్ణు మాత్రం కూల్ గా సమాధానాలు ఇచ్చాడు.

Manchu Vishnu Tweet on Social Media Negativity

Manchu Vishnu : మంచు విష్ణు త్వరలో కన్నప్ప సినిమాతో రాబోతున్నాడు. ఏప్రిల్ 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు నిన్న రాత్రి ట్విట్టర్లో నెటిజన్లతో ముచ్చటించాడు. ఫ్యాన్స్, నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.

అయితే మంచు ఫ్యామిలీ, మంచు విష్ణు మీద సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ వస్తాయని తెలిసిందే. వాళ్ళు మాట్లాడే స్పీచ్ లు, మాటలు, వాళ్ళ సినిమాలను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తారు. గతంలో అలా ట్రోల్ చేసే వారిని మంచు విష్ణు తీవ్రంగా హెచ్చరించి నోటీసులు కూడా పంపించారు. కానీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం ఈ ట్రోల్స్, నెగిటివిటీకి స్పందించట్లేదు మంచు ఫ్యామిలీ. దీనికి తోడు మంచు మనోజ్ తో ఉన్న వివాదం వైరల్ అయి ట్రోల్స్ వచ్చినా స్పందించలేదు.

Also Read : Kannappa Teaser 2 : మంచు విష్ణు ‘క‌న్న‌ప్ప’ నుంచి మ‌రో టీజ‌ర్.. అదిరిపోయిన ప్ర‌భాస్ ఎంట్రీ..

తాజాగా సోషల్ మీడియాలో #AskVishnu పేరుతో నెటిజన్లతో ముచ్చటించగా ఇక్కడ కూడా విష్ణుకి అన్ని నెగిటివ్ ప్రశ్నలే ఎదురయ్యాయి. ఎందుకు ఇంత ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నావు, నువ్వు యాక్టింగ్ మానెయ్, అక్షయ్ కుమార్ కి అన్ని ఫ్లాప్స్ ఉన్నా నీ సినిమాలో ఎందుకు పెట్టుకున్నావు, జనరేటర్ లో పంచదార ఎందుకు పోసావు, మూవీ పోస్టర్స్ బాగోలేదు.. ఇలా అన్ని నెగిటివ్ ప్రశ్నలే అడిగారు.

వీటన్నిటికి మంచు విష్ణు పాజిటివ్ గా సమాధానం ఇవ్వడం గమనార్హం. డైరెక్ట్ గా ట్రోల్ చేస్తూ ప్రశ్నలు అడిగినా మంచు విష్ణు మాత్రం కూల్ గా సమాధానాలు ఇచ్చాడు. దీంతో ఎంత నెగిటివ్ మీ మీద వస్తున్నా పాజిటివ్ గా ఉంటూ సమాధానం చెప్తున్నారు అని ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. ప్రశ్నలు – సమాధానాలు అయ్యాక మంచు విష్ణు ఈ నెగిటివిటి పై ఒక ట్వీట్ కూడా చేసారు.

Also See : Dilruba : దిల్‌రూబా మూవీ నుంచి ‘కన్నా నీ’ సాంగ్

మంచు విష్ణు తన ట్వీట్ లో.. #AskVishnu లో ప్రతి నిమిషం చాలా చాలా ఎంజాయ్ చేశాను. నేను ఆన్సర్ చేయలేకపోయిన అందరికి సారీ. నెక్స్ట్ టైం అందరి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. కుదిరినంతవరకు ప్రేమను, పాజిటివిటినే స్ప్రెడ్ చేద్దాం. నెగిటివిటి వల్ల ఏది జరగదు. సెటైరికల్ కామెడీ బాగానే ఉంటుంది కానీ నెగిటివిటి మంచిది కాదు. మనం అందరం సినిమా లవర్స్. ఒకర్నొకరు ప్రేమించుకుందాం సినిమాని ఎంజాయ్ చేద్దాం అంటూ రాసుకొచ్చారు.

దీంతో ఎన్నో రోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తే మొదట్లో సీరియస్ అయినా మంచు విష్ణు ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గా సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రశ్నలు అడిగిన కూల్ గా సమాధానాలు చెప్పడంతో పాటు నెగిటివిటి వద్దు అని మంచు విష్ణు ట్వీట్ చేయడంతో ఇంత మంచోడిలా ఎప్పుడు మారిపోయావు భయ్యా అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.