మేమిద్దరం.. మాకు నలుగురు : మళ్లీ తండ్రి కాబోతున్న మంచు విష్ణు

మంచు విష్ణు, విరానికా దంపతులు నాలుగవ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని విష్ణు ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు..

  • Published By: sekhar ,Published On : May 2, 2019 / 09:21 AM IST
మేమిద్దరం.. మాకు నలుగురు : మళ్లీ తండ్రి కాబోతున్న మంచు విష్ణు

Updated On : May 2, 2019 / 9:21 AM IST

మంచు విష్ణు, విరానికా దంపతులు నాలుగవ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని విష్ణు ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు..

త్వరలో మంచు విష్ణు, విరానికా దంపతులు నాలుగవ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని విష్ణు ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు. ప్రస్తుతం ఈ జంట అమెరికాలో ఉన్నారు. అక్కడ ఇద్దరూ కలిసి దిగిన పిక్ షేర్ చేసాడు విష్ణు. ఆ ఫోటోలో విరానికా బేబీ బంప్‌తో ఉంది. ఈ దంపతులకు ఇప్పటికే ఆరియానా, వివియానా, అవ్రామ్ అనే ముగ్గురు పిల్లలున్నారు. అరియానా, వివియానా ట్విన్స్ కాగా, తర్వాత అవ్రామ్ పుట్టాడు.

ఈ గుడ్ న్యూస్‌ని విష్ణు తెలియ చెయ్యగానే పలువురు విష్ చేస్తున్నారు. ఇంకొందరు ‘మీకు కంట్రోల్ లేదు’ అని, ‘మళ్ళీ మీరే బిడ్డను కనే కంటే ఎవరైనా అనాధను దత్తత తీసుకోవచ్చుగా’ అంటూ సలహాలిస్తుంటే, మరికొందరు ‘విష్ణు పిల్లలందరూ అమెరికాలోనే పుట్టారు, వాళ్ళంతా అక్కడి పౌరులే, ఇండియా పాపులేషన్‌లో వాళ్ళు లెక్కకు రారు’ అని అంటున్నారు. విష్ణు నటించిన ఓటర్ మూవీ రిలీజ్‌కి రెడీగా ఉంది.