రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న, హిందీ, తెలుగు, తమిళ్‌లో మణికర్ణిక ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో, వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా, మణికర్ణిక, ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ. దర్శకుడు క్రిష్‌తో పాటు, కొంత భాగాన్నికంగనా కూడా డైరెక్ట్ చేసింది. జీ స్టూడియోస్, కమల్ జైన్ నిర్మిస్తున్నమణికర్ణిక, హిందీతో పాటు, తెలుగు, తమిళ్ భాషల్లోనూ రిలీజ్ కానుంది. తెలుగులో మణికర్ణిక, ఝాన్సీరాణి పేరుతో రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, తెలుగు ట్రైలర్‌ని రిలీజ్ చేసారు మేకర్స్.
ఈ సినిమా హిందీ ట్రైలర్‌ని ఇంతకుముందు చూసినా, తెలుగు ట్రైలర్ కూడా, చూడాలనిపించేలా రూపొందించారు. క్యారెక్టర్స్‌కి తగ్గ వాయిస్‌లతో పాటు, డబ్బింగ్ క్వాలిటీ, బ్యాక్ గ్రౌండ్‌లో వినిపిస్తున్న సాంగ్ కూడా బాగుంది. దర్శకుడు రాజమౌళి తండ్రి, వి.విజయేంద్ర ప్రసాద్, ఈ సినిమాకి కథ, స్ర్కీన్‌ప్లే అందించగా, ప్రసూన్ జోషి మాటలు, పాటలు రాసారు.
రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న, హిందీ, తెలుగు, తమిళ్‌లో మణికర్ణిక ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది.
వాచ్ మణికర్ణిక తెలుగు ట్రైలర్…