Maniratnam movies missing magical elements audience feels
Maniratnam : తమిళ్(Tamil) డైరెక్టర్ అయినా పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు మణిరత్నం(Maniratnam). ఒకప్పుడు రోజా, దిల్ సే, బొంబాయి, సఖి, రీసెంట్ గా ఓకే బంగారం లాంటి సినిమాలతో పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఇప్పుడు అర్దమయ్యేలా కథలు చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారని ఫీలవుతున్నారు ఆడియన్స్, ఫ్యాన్స్. మణిరత్నం లేటెస్ట్ మూవీ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2(Ponniyin Selvan) రిలీజ్ కి రెడీ అవుతోంది. ఫస్ట్ పార్ట్ ఎలాగూ సరిగా అర్దం కాలేదు, పార్ట్ 2 అయినా అర్దమయ్యేలా తీశారా లేదా అని డౌట్ లో ఉన్నారు జనాలు.
500కోట్ల భారీ బడ్జెట్, ఐశ్వర్యారాయ్, త్రిష, కార్తి, విక్రమ్, జయం రవి లాంటి స్టార్ కాస్ట్ తో భారీ విజువల్స్ తో గ్రాండ్ గా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 ఏప్రిల్ 28న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రీచ్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు టీమ్. తమిళ్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ పొన్నియిన్ సెల్వన్ తమిళ్ ఆడియన్స్ కి తప్ప మిగిలిన వాళ్లకి అసలే మాత్రం ఎక్కడం లేదు. బేసిక్ గా తమిళ్ హిస్టరీ కావడంతో తమిళ్ ఆడియన్స్ కి మాత్రమే రిలేట్ చేశారు మణిరత్నం. దాంతో మిగిలినవాళ్లు సినిమాకి ఏమాత్రం కనెక్ట్ కావడం లేదు. అందుకే తమిళ్ లో తప్ప పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ ఎక్కడా సక్సెస్ అవ్వలేదు.
ఒకప్పుడు మణిరత్నం సినిమాలు తమిళ్ లో తెరకెక్కినా అవి మిగిలిన లాంగ్వేజెస్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. అంతలా ఆడియన్స్ మణిరత్నం సినిమాలకు కనెక్ట్ అయ్యేవారు. అంతేకాదు ఆ సినిమాల్లో స్టోరీ, స్టోరీ టెల్లింగ్ అంత మ్యాజికల్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ ఏం కనిపించకపోవడంతో పొన్నియిన్ సెల్వన్ కి డిటాచ్ అవుతున్నారు నాన్ తమిళ్ ఆడియన్స్. డబ్బింగ్ చేసినా కూడా కనీసం తెలుగు జనానికి కూడా సినిమా అర్దం కాలేదంటే మణిరత్నం మ్యాజిక్ ఎక్కడో మిస్ అవుతోందని ఫీలవుతున్నారు ఫ్యాన్స్. ఈ సారైనా కన్విన్సింగ్ గా పార్ట్ 2 తీశారా? అర్దమయ్యే ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? సెకండ్ పార్ట్ అయినా తమిళ్ లో కాకుండా వేరే రాష్ట్రాల్లో సక్సెస్ అవుతుందా? లేక ఇది కూడా పార్ట్ 1 లాగే అర్ధం కాకుండా ఉంటుందా అని నాన్ తమిళ్ ప్రేక్షకులు భావిస్తున్నారు.
వాళ్ళ తమిళ హిస్టరీ చూపించే ఇలాంటి సినిమాలు కాకుండా మణిరత్నం స్టైల్ కి తగ్గట్టు సినిమాలు చేయాలని, ఆ సినిమాల్లో ఉండే మ్యాజిక్ చూపించాలని కోరుకుంటున్నారు ప్రేక్షకులు. లేకపోతే పొన్నియిన్ సెల్వన్ సినిమా లాగే మణిరత్నం సినిమాల్లో మ్యాజిక్, ఫీలింగ్ మిస్ అవుతుంది అంటున్నారు అభిమానులు, ప్రేక్షకులు. మరి భవిష్యత్తులో మణిరత్నం మళ్ళీ అలాంటి మ్యాజికల్ సినిమాలు చేస్తాడేమో చూడాలి.