Manisha Rani
Manisha Rani-Mahesh Bhatt : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-2 సోమవారంతో ముగిసింది. ఈ సీజన్ విజేతగా ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ నిలిచాడు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అతడు ట్రోఫీతో పాటు 25 లక్షల నగదును కూడా అందుకున్నాడు. ఆసక్తికరంగా సాగిన ఈ సీజన్‌లో టాప్-5 కంటెస్టెంట్స్‌లో మనీషా రాణి ఒకరు. ఆమె హౌస్‌లో ఉండగా షోకు హీరోయిన్ అలియా భట్ తండ్రి మహేశ్ భట్ అతిథిగా వచ్చారు.
ఆయన మనీషా రాణి చేతిని ముద్దు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా నెటీజన్లు మహేశ్ భట్ తీరుపై విరుచుకుపడ్డారు. వయసులో పెద్దవాడు అయ్యుండి ఆమెను అసభ్యంగా తాకడం ఏంటని మండిపడ్డారు. దీనిపై హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత మనీషా రాణి స్పందించింది. తనకు ఆయన చేసిన దానిలో ఎలాంటి తప్పు కనిపించలేదని చెప్పుకొచ్చింది. ఆయన ఉద్దేశం చాలా స్వచ్ఛమైనది అంటూ మహేశ్ భట్ ను వెనకేసుకొచ్చింది.
Mahesh Babu : ‘బిజినెస్ మేన్’ టైంలో మహేష్ ఆ ప్రయోగం చేశాడట.. కానీ వర్క్ అవుట్ అవ్వక.. ఏంటది?
మహేష్ భట్ చాలా పెద్ద దర్శకుడని, అతడిని కలవాలనేది తన కల అని చెప్పింది మనీషా రాణి. ఆయన అలా చేయడం వల్ల తనకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని తెలిపింది. అతడు నన్ను అనుచితంగా తాకాడని ప్రజలు అనుకుంటుంటే అది చాలా పెద్ద తప్పు అని అంది. అతడు తనకు అంకుల్‌తో సమానం అని, వృద్ధులు తమ ప్రేమను కొన్నిసార్లు తాకడం ద్వారా వ్యక్తం చేస్తారని పేర్కొంది. ఆయన ఉద్దేశం చాలా స్వచ్చమైందని మనీషా అంది.
దీనిపై బిగ్‌బాస్ OTT 2 ఫైనలిస్ట్, మహేశ్ భట్ కూతురు పూజా భట్ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి మనీషాతో పాటు ఇతర పోటీదారులను కూడా కౌగిలించుకున్నాడని, ముద్దు పెట్టుకున్నాడని చెప్పింది. అతడు హౌస్‌లో ఉన్న సమయంలో తనతో తక్కువ సమయం గడిపాడని ఆమె పేర్కొంది. ఎవ్వరికి ఎలాంటి సమస్య లేదంది. ప్రజలు నిజంగా అలా ఆలోచిస్తే వారి ఇష్టం. దీనిపై తాను గానీ, తన తండ్రి గానీ ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదంది.
Bhagavanth Kesari : బాలయ్య ‘భగవంత్ కేసరి’ హరికృష్ణ సినిమా రీమేకా..? అసలు నిజం ఏంటంటే..?
#Livefeed !!
Mahesh Bhatt ne #Manisha ke hath pe kiss kiya!! #BiggBossOTT2pic.twitter.com/mt1ZVVKmuD— Livefeed Videos (@BBosslivefeed1) August 1, 2023