Manmadhudu Actress Anshu Ambani Re Entry With Sundeep Kishan Mazaka Movie First Look goes Viral
Anshu Ambani : సాధారణంగా హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇస్తారని తెలిసిందే. అయితే రీ ఎంట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో లేక తమ ఏజ్ కి తగ్గ హీరోల పక్కన హీరోయిన్స్ గానో నటిస్తారు. కానీ ఈ హీరోయిన్ రీ ఎంట్రీ ఆసక్తికరంగా మారింది. నాగార్జున మన్మధుడు సినిమాలో ఫ్లాష్ బ్యాక్ పాత్రలో కనిపించి అన్షు అంబానీ అప్పటి యువతను మెప్పించింది. ఆ తర్వాత ప్రభాస్ రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత మిస్సమ్మ సినిమాలో గెస్ట్ పాత్రలో నటించి, ఓ తమిళ్ సినిమా చేసి సినిమాలకు దూరమైంది.
Also Read : Director Shankar : అతను మరణించిన తర్వాతే ‘శంకర్’ సినిమాల ఫలితాలు ఇలా..? సుజాత లేని లోటు తెలుస్తుంది..
నాలుగు సినిమాలు చేసి పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది అన్షు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అన్షు రీ ఎంట్రీ ఇస్తుంది. ఇటీవల తెలుగులో పలు టీవీ షోలలో కనిపించి, పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఇన్నేళ్ల తర్వాత కూడా అన్షు తన అందాన్ని మెయింటైన్ చేసినా అప్పటి లుక్స్ కి, ఇప్పటి లుక్స్ కి చాలా తేడానే ఉంది. ఇప్పుడు అన్షు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న మజాకా సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
తాజాగా నేడు మజాకా సినిమా నుంచి అన్షు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఫస్ట్ లుక్ లో అన్షు పెళ్లి కూతురు గెటప్ లో చేతిలో తాళి, కొబ్బరిబోండం పట్టుకొని ఉంది. ఈ సినిమా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవ్వగా అప్పుడెప్పుడో నాగార్జున పక్కన హీరోయిన్ గా చేసిన అన్షు ఇప్పుడు సందీప్ కిషన్ పక్కన చేస్తుండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇందులో రావు రమేష్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఈమె రావు రమేష్ పక్కన పెయిర్ గా చేస్తుందేమో అని కూడా అంటున్నారు.
Also Read : Vishal : నాకు ఎలాంటి సమస్య లేదు.. సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తాను అనుకున్నారు.. ఆరోగ్యంపై విశాల్ క్లారిటీ..
ఇక ఈ సినిమా టీజర్ నేడు సాయంత్రం రిలీజ్ చేయనున్నారు. మజాకా సినిమాలో అన్షు తన రీ ఎంట్రీతో ఎలా మెప్పిస్తుందో చూడాలి.
ఈ సినిమాలో మరో హీరోయిన్ రీతూ వర్మ కూడా నటిస్తుంది. రీతూ వర్మ పోస్టర్ కూడా రిలీజ్ చేయగా ఈమె కూడా పెళ్లి కూతురు గెటప్ లో ఉంది. దీంతో ఇదేదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ లా ఉండబోతుందని తెలుస్తుంది.