Director Shankar : అతను మరణించిన తర్వాతే ‘శంకర్’ సినిమాల ఫలితాలు ఇలా..? సుజాత లేని లోటు తెలుస్తుంది..
శంకర్ తెలుగులో గేమ్ ఛేంజర్ సినిమా తీయడంతో ఈ సినిమాకు కూడా కాస్త టాక్ అటు ఇటు వస్తుండటంతో మరోసారి సుజాత రంగరాజన్ ప్రస్తావన వస్తుంది.

lack of Sujatha Rangarajan is evident in Director Shankar's films
Director Shankar – Sujatha Rangarajan : డైరెక్టర్ శంకర్.. రాజమౌళి తెరమీదకు రాకముందు వరకు సౌత్ లో స్టార్ డైరెక్టర్ అంటే ఈయన పేరే చెప్పేవాళ్ళు. రాజమౌళి కూడా శంకర్ గురించి ఓ రేంజ్ లో పొగిడారు. జెంటిల్మన్, భారతీయుడు, ప్రేమికుడు, జీన్స్, ఒకేఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, రోబో.. ఇలా వరుసపెట్టి సూపర్ హిట్ సినిమాలు తీశారు. ప్రతి సినిమా ఒక అద్భుతమే. సినిమాల్లో సాంగ్స్, సీన్స్, డైలాగ్స్ అన్ని అదిరిపోయేవి.
కానీ రోబో తర్వాత నుంచి శంకర్ పరిస్థితి మారిపోయింది. రోబో తర్వాత శంకర్ స్నేహితుడు, ఐ, రోబో 2, భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. వీటిల్లో స్నేహితుడు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకొని యావరేజ్ గా నిలిచింది. ఐ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. రోబో 2 సినిమా సాంకేతికంగా బాగున్నా, కలెక్షన్స్ బాగా వచ్చినా కథ, కథనంలో బలం లేదు అని విమర్శలు వచ్చాయి. ఇక భారతీయుడు 2 సరేసరి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటుంది.
Also Read : Vishal : నాకు ఎలాంటి సమస్య లేదు.. సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తాను అనుకున్నారు.. ఆరోగ్యంపై విశాల్ క్లారిటీ..
ఒకప్పుడు వరుస హిట్స్ కొట్టిన స్టార్ డైరెక్టర్ శంకర్ ఇప్పుడు ఎందుకు అలాంటి హిట్స్ ఇవ్వలేకపొతున్నాడు అని విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే చాలా మంది దీనికి చెప్పే కారణం ఒకటే. రైటర్ సుజాత రంగరాజన్ చనిపోవడం. తమిళ్ స్టార్ రచయిత రంగరాజన్ సుజాత కలం పేరుతో పుస్తక రచయితగా, సినిమా రచయితగా కథ, కథనం, మాటలు అందించేవారు. చాలా తమిళ్ సినిమాలకు ఈయన పనిచేసి మంచి హిట్స్ అందించారు.
శంకర్ టీమ్ లో కూడా మొదటి రెండు మూడు సినిమాలకు తప్పిస్తే ప్రతి సినిమాకు సుజాత రంగరాజన్ పనిచేసారు. శంకర్ కు కుడి భుజంగా ఉండి కథ, కథనం, డైలాగ్స్ ని డెవలప్ చేసారు. ఈయన 2008లో మరణించారు. అప్పటికే రోబో సినిమాకు పనిచేసి మరణించారు. రోబో సినిమా షూటింగ్ సమయంలో ఈయన మరణించారు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత నుంచే శంకర్ సినిమాల్లో ఏదో మ్యాజిక్ మిస్ అవుతూ వచ్చింది. సుజాత రంగరాజన్ లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది అంటూ గతంలోనే తమిళ మీడియాలు రాశాయి. భారతీయుడు 2 డిజాస్టర్ అయినప్పుడు అందరూ సుజాత రంగరాజన్ నే తలుచుకున్నారు.
ఇప్పుడు శంకర్ తెలుగులో గేమ్ ఛేంజర్ సినిమా తీయడంతో ఈ సినిమాకు కూడా కాస్త టాక్ అటు ఇటు వస్తుండటంతో మరోసారి సుజాత రంగరాజన్ ప్రస్తావన వస్తుంది. శంకర్ సినిమాలకు సుజాత రంగరాజన్ బ్యాక్ బోన్ గా నిలిచారని, ఆయన మరణం తర్వాతే శంకర్ సినిమాలకు నెగిటివ్ టాక్స్ వస్తున్నాయని, శంకర్ రైటింగ్ టీమ్ ని బలపరుచుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఇండియన్ 3తో రాబోతున్న శంకర్ ఆ సినిమాతో మెప్పిస్తారా లేక ఆ సినిమా కూడా ఇండియన్ 2 లాగే ఉంటుందా? ఆ తర్వాత సినిమాలు చేస్తారా శంకర్ అనే కొత్త సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. శంకర్ ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందుతూ శంకర్ గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.