Anil Ravipudi : స్టార్ హీరో సినిమా డైరెక్ట్ చేయమని ఛాన్స్ ఇస్తే రిజెక్ట్ చేసిన అనిల్ రావిపూడి.. తమిళ పరిశ్రమలో చర్చ..

డైరెక్టర్ అనిల్ రావిపూడికి విజయ్ సినిమా ఛాన్స్ ఇస్తే రిజెక్ట్ చేసాడంట.

Anil Ravipudi : స్టార్ హీరో సినిమా డైరెక్ట్ చేయమని ఛాన్స్ ఇస్తే రిజెక్ట్ చేసిన అనిల్ రావిపూడి.. తమిళ పరిశ్రమలో చర్చ..

VTV Ganesh Said Director Anil Ravipudi Rejected Thalapathy Vijay Last Movie

Updated On : January 12, 2025 / 11:34 AM IST

Anil Ravipudi : రాజమౌళి తర్వాత 100 శాతం సక్సెస్ రేట్ ఉన్న రేర్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ నుంచి భగవంత్ కేసరి వరకు అన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. భగవంత్ కేసరి తప్ప అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలే. అనిల్ రావిపూడి అంటే ఫ్యామిలీతో కలిసి వెళ్లొచ్చు, హ్యాపీగా నవ్వుకోవచ్చు అనే మార్క్ ని సెట్ చేసుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి రోజు జనవరి 14న రిలీజ్ కానుంది.

నిన్న సాయంత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమా మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సినిమాలో నటించిన స్టార్స్ అంతా పాల్గొని మాట్లాడారు. తమిళ్ స్టార్ కమెడియన్ VTV గణేష్ కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించారు. ఈ ఈవెంట్లో VTV గణేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

Also Read : Game Changer Piracy : ‘గేమ్ ఛేంజర్’కు షాక్.. ప్రైవేట్ బస్సుల్లో పైరసీ షో..

VTV గణేష్ మాట్లాడుతూ.. తలపతి విజయ్ భగవంత్ కేసరి సినిమా 5 సార్లు చూసారు. ఆ సినిమా చూసి నన్ను పిలిచి ఆ డైరెక్టర్ మీకు ఫ్రెండ్ కదా పిలిచి మాట్లాడండి నా చివరి సినిమా డైరెక్ట్ చేస్తాడేమో అడగండి అని చెప్పారు. నేను అనిల్ రావిపూడిని అడిగితే రీమేక్ సినిమాలు చేయను అన్నారు. అక్కడ విజయ్ లాస్ట్ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ వదులుకున్నాడు. ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసి ఇందులో నాకు ఆఫర్ ఇచ్చాడు అని తెలిపారు. దీంతో VTV గణేష్ వ్యాఖ్యలు తెలుగు, తమిళ పరిశ్రమలలో చర్చగా మారాయి.

గతంలో అనిల్ రావిపూడి బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ తో భగవంత్ కేసరి సినిమా తీసి దసరాకు రిలీజ్ చేసి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. తన రొటీన్ కామెడీని పక్కన పెట్టి ఒక సీరియస్ సబ్జెక్టుతో ఈ సినిమాని తెరకెక్కించి సక్సెస్ అయ్యారు అనిల్. ఈ సినిమాని తమిళ్ స్టార్ విజయ్ రీమేక్ చేస్తున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు VTV గణేష్ అధికారికంగా చెప్పడంతో విజయ్ ఈ సినిమాని రీమేక్ చేస్తున్నాడని క్లారిటీ వచ్చేసింది. అయితే విజయ్ లాంటి స్టార్ హీరో అనిల్ రావిపూడికి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే అనిల్ వద్దని చెప్పాడని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

Also Read : Daaku Maharaaj : బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ట్విట్టర్ రివ్యూ..

ఇక తమిళ్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇటీవలే తన చివరి సినిమాని H వినోద్ దర్శకత్వంలో ప్రకటించారు. ఈ సినిమా భగవంత్ కేసరి రీమేక్ అని క్లారిటీ వచ్చేసింది. మరి విజయ్ ఈ సినిమాని ఏ రకంగా మారుస్తాడో చూడాలి. ఈ సినిమా తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించనున్నారు.