Game Changer Piracy : ‘గేమ్ ఛేంజర్’కు షాక్.. ప్రైవేట్ బస్సుల్లో పైరసీ షో..
సంక్రాతికి హైదరాబాద్ నుంచి ఆంధ్రా వెళ్లే బస్సుల్లో గేమ్ ఛేంజర్ సినిమా పైరసీ ప్రింట్ వేశారు.

Game Changer Piracy Copy Telecasting in Private Buses Videos goes Viral
Game Changer Piracy : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఇటీవలే జనవరి 10న రిలీజయింది. మొదటి రోజు మిక్స్‌డ్ టాక్ వినిపించినా ప్రస్తుతం థియేటర్స్ లో బాగానే నడుస్తుంది. నార్త్ లో అయితే గేమ్ ఛేంజర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సంక్రాంతి హాలిడేస్ కూడా ఉండటంతో సినిమాకు కలిసొచ్చింది. మొదటి రోజు గేమ్ ఛేంజర్ సినిమా 186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Also Read : Daaku Maharaaj : బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ట్విట్టర్ రివ్యూ..
అయితే సినిమాలకు పైరసీ ఎఫెక్ట్ ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుందని తెలిసిందే. పెద్ద సినిమాలకు అయితే ఈ పైరసీ ఎఫెక్ట్ ఇంకా అంటుంది. సినిమా రిలీజయిన నెక్స్ట్ డేనే గేమ్ ఛేంజర్ సినిమా HD ప్రింట్ ని పైరసీ చేసారు. అంతేకాకుండా సంక్రాతికి హైదరాబాద్ నుంచి ఆంధ్రా వెళ్లే బస్సుల్లో గేమ్ ఛేంజర్ సినిమా పైరసీ ప్రింట్ వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
సాధారణంగా బస్సుల్లో సినిమాలు వేస్తారని తెలిసిందే. కానీ రిలీజయిన నెక్స్ట్ డే పెద్ద సినిమా పైరసీ ప్రింట్ వేయడంతో ఫ్యాన్స్, సినిమా లవర్స్ మండిపడుతున్నారు. మూవీ యూనిట్ దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మూవీ యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read : Sukumar : వాట్.. సుకుమార్ ఆ హీరోకు వీరాభిమానా? ఎవ్వరూ ఊహించి ఉండరు..
అయితే సంక్రాంతికి ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ రేట్లు బాగా పెంచేస్తాయని తెలిసిందే. దీంతో కొంతమంది టికెట్ రేట్లు పెంచినందుకు సినిమాకు కూడా కలిపి తీసుకున్నారు అని ప్రైవేట్ ట్రావెల్స్ కు కౌంటర్లు వేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా ఒక పెద్ద సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే ఇలా పబ్లిక్ గా ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్ లో టెలికాస్ట్ చేయడం సీరియస్ గా పరిగణించాల్సిన విషయమే.