Sukumar : వాట్.. సుకుమార్ ఆ హీరోకు వీరాభిమానా? ఎవ్వరూ ఊహించి ఉండరు..
తాజాగా సుకుమార్ పుష్ప 2 సక్సెస్ సందర్భంగా ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

Sukumar Says about His Favorite Hero Here the Details
Sukumar : డైరెక్టర్ సుకుమార్ తన సినిమాల్లో కొత్తదనం, సరికొత్త స్క్రీన్ ప్లేతో మెప్పించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. లెక్కల మాస్టర్ కాస్త డైరెక్టర్ గా మారి తన క్రియేటివిటిని సినిమాల్లో చూపిస్తున్నాడు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ పుష్ప, పుష్ప 2 సినిమాలతో వచ్చి పాన్ ఇండియా హిట్స్ కొట్టి రాజమౌళిని మించిన డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఇటీవల అల్లు అర్జున్ తో తెరకెక్కించిన పుష్ప 2 రిలీజయి ఏకంగా 1830 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాహుబలి 2 రికార్డులను బద్దలుకొట్టింది.
అయితే తాజాగా సుకుమార్ పుష్ప 2 సక్సెస్ సందర్భంగా ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో సుకుమార్ అనేక ఆసక్తికర అంశాలను తెలిపారు. ఈ క్రమంలో తన ఫేవరేట్ హీరో గురించి చెప్పారు.
Also Read : Rashmika Mandanna : కాలికి గాయంతో రష్మిక.. దిగాలుగా కూర్చొని.. నాకు గాయమైంది అంటూ పోస్ట్..
సుకుమార్ మాట్లాడుతూ.. హీరో రాజశేఖర్ కు నేను వీరాభిమానిని. రాజశేఖర్ గారు చేసిన ఆహుతి, ఆగ్రహం, అంకుశం, తలంబ్రాలు, మగాడు.. ఇలా చాలా సినిమాలు నన్ను ప్రభావితం చేసాయి. చదువుకునే రోజుల్లో అందరి ముందు రాజశేఖర్ ని ఇమిటేట్ చేసేవాన్ని. దాంతో నేను బాగా ఫేమస్ అయ్యాను. నా రాజశేఖర్ పర్ఫార్మెన్స్ అందరికి నచ్చేది. అప్పుడే నేను ఏదైనా చేయగలను అనే నమ్మకం వచ్చింది. దానికి కారణం రాజశేఖర్ గారే అని చెప్పారు. ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా రాజశేఖర్ ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చారు. గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. కానీ గతంలో వరుస సినిమాలు చేసి భారీ హిట్స్ కొట్టి ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా రాజశేఖర్ అభిమాని అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. రాజశేఖర్ ఇటీవల నితిన్ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ప్లే చేశారు. మళ్ళీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు.
Also Read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’కు తెలంగాణలో షాక్.. హైకోర్టు ఆదేశాలతో అదనపు షోలు రద్దు..
ఇక సుకుమార్ జగడం నుంచి పుష్ప 2 వరకు తన సినిమాల రేంజ్ పెంచుకుంటూ క్లాస్ డైరెక్టర్ నుంచి ఊర మాస్ డైరెక్టర్ గా మారారు. త్వరలో రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నారు. అలాగే పుష్ప 3 కూడా ఉంది.
