Rashmika Mandanna : కాలికి గాయంతో రష్మిక.. దిగాలుగా కూర్చొని.. నాకు గాయమైంది అంటూ పోస్ట్..
తన కాలికి కట్టు కట్టగా సోఫాలో దిగాలుగా కుర్చొని ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ రష్మిక..

Rashmika Mandanna Shares her Injure Leg Photos and Tells about Incident
Rashmika Mandanna : రష్మిక మందన్న ఇటీవలే పుష్ప 2 సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాలో తన నటనతో, డ్యాన్సులతో ఇంప్రెస్ చేసింది. ఈ సినిమా 1830 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాహుబలి 2 రికార్డులను కూడా బద్దలు కొట్టింది. అయితే ఇటీవల రష్మిక జిమ్ లో గాయపడిందని వార్తలు వచ్చాయి. తాను చేస్తున్న సికిందర్ సినిమా షూట్ కూడా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. తాజాగా రష్మిక దీనిపై అధికారికంగా పోస్ట్ చేసింది..
Also Read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’కు తెలంగాణలో షాక్.. హైకోర్టు ఆదేశాలతో అదనపు షోలు రద్దు..
తన కాలికి కట్టు కట్టగా సోఫాలో దిగాలుగా కుర్చొని ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ రష్మిక.. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను జిమ్ లో గాయపడ్డాను. ప్రస్తుతం నేను హోప్ మోడ్ లో ఉన్నాను. కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు పడుతుందో తెలీదు. ఆ దేవుడికే తెలియాలి. నేను మళ్ళీ తామా, సికిందర్, కుబేర సెట్స్ కి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నాను. నా డైరెక్టర్స్ కి సారీ. నేను త్వరగా తిరిగి వచ్చి యాక్షన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ లోపు నేను మీకు అవసరమైతే ఒక మూలాన కూర్చొని అడ్వాన్స్ పని చేస్తాను అని తెలిపింది.
దీంతో రష్మిక పోస్ట్ వైరల్ గా మారింది. రష్మిక త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు కూడా కోరుకుంటున్నారు. ఇక రష్మిక ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. సౌత్, హిందీ సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో చావా, తామా, సికిందర్, కుబేర, ది గర్ల్ ఫ్రెండ్.. ఇలా అరడజను సినిమాలు ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్న సమయంలో ఇలా జరిగి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి రావడం కష్టమే.
Also Read : Satya Sri : లవ్ అని నా వెనక తిరిగితే అతన్ని మా బాబాయ్ వాళ్ళు కొట్టించారు.. జబర్దస్త్ సత్యశ్రీ లవ్ స్టోరీ..