Game Changer : ‘గేమ్ ఛేంజర్’కు తెలంగాణలో షాక్.. హైకోర్టు ఆదేశాలతో అదనపు షోలు రద్దు..
తాజాగా కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఇచ్చిన అనుమతులను ఉపసంహరించుకుంది ప్రభుత్వం.

Telangana Government Removed Game Changer Hikes and Special Shows with Court Orders
Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా నిన్న జనవరి 10న థియేటర్స్ లో రిలీజయింది. భారీ సినిమా కావడం, సంక్రాంతి హాలిడేస్ కూడా ఉండటంతో ఈ సినిమాకు ఏపీలో అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇచ్చారు. ఇటీవల పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటనతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని చెప్పారు. కానీ చివరి నిమిషంలో తెలంగాణలో అర్ధరాత్రి ఒంటి గంట షోని రిజెక్ట్ చేసినా ఉదయం 4 గంటల నుంచి అనుమతి ఇచ్చారు. టికెట్ రేట్లను కూడా పెంచుకోడానికి అనుమతులు ఇచ్చారు.
Also Read : Satya Sri : లవ్ అని నా వెనక తిరిగితే అతన్ని మా బాబాయ్ వాళ్ళు కొట్టించారు.. జబర్దస్త్ సత్యశ్రీ లవ్ స్టోరీ..
అయితే దీనిని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన హైకోర్టు అదనపు షోలను, పెంచిన టికెట్ రేట్లను రద్దు చేయమనడంతో తాజాగా కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఇచ్చిన అనుమతులను ఉపసంహరించుకుంది ప్రభుత్వం. ఈ మేరకు హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా హైకోర్టు సూచనల మేరకు గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఇచ్చిన వెసులుబాటును ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే భవిష్యత్ లో తెల్లవారు ఝామున ప్రదర్శించే స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వమని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాతల అభ్యర్థన మేరకే ఆ సినిమా బడ్జెట్, ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ దృష్ట్యా ప్రభుత్వం అన్నిరకాలుగా పరిశీలించి 10వ తేదీన 4 గంటల షోకు, 11 నుంచి 19 వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
దీంతో తెలంగాణలో గేమ్ ఛేంజర్ కి షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఉదయం 8 గంటల షో ఉండకపోవచ్చని, టికెట్ రేట్లు కూడా తగ్గుతాయని తెలుస్తుంది. ఇది కలెక్షన్స్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని పలువురు భావిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం టికెట్ రేట్లు తగ్గాయి కాబట్టి సంక్రాంతి హాలిడేస్ లో ఫ్యామిలీతో వస్తారు అని అంటున్నారు. దీంతో ఫ్యూచర్ లో పెద్ద సినిమాలకు తెలంగాణలో అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండకపోవచ్చని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో భారీగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా మొదటి రోజు 186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.