AS Ravikumar : టీజర్ లాంచ్‌లో పబ్లిక్‌గా హీరోయిన్‌కు ముద్దు పెట్టిన టాలీవుడ్ దర్శకుడు.. వీడియో వైరల్
ఇటీవల దర్శకులు చేసే కొన్ని పనులు వివాదాస్పదంగా మారుతున్నాయి. మొన్నామధ్య ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ తిరుమల దర్శనానికి వచ్చిన హీరోయిన్ కృతి సనన్‌కు సెండాఫ్ ఇస్తూ ముద్దు పెట్టడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
- Thota Vamshi Kumar
- Published on- August 29, 2023 / 07:35 PM IST
Ravikumar kiss Mannara Chopra
AS Ravikumar kiss Mannara Chopra : ఇటీవల దర్శకులు చేసే కొన్ని పనులు వివాదాస్పదంగా మారుతున్నాయి. మొన్నామధ్య ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ తిరుమల దర్శనానికి వచ్చిన హీరోయిన్ కృతి సనన్‌కు సెండాఫ్ ఇస్తూ ముద్దు పెట్టడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజాగా ఓ తెలుగు దర్శకుడు సైతం అలాంటి పనినే చేయగా నెటీజన్లు అతడిపై మండిపడుతున్నారు.
Naa Saami Ranga : నాగార్జున ‘నా సామిరంగ’ ఆ మలయాళ మూవీకి రీమేక్..?
యజ్ఞం, వీరభద్ర, పిల్లా నువ్వులేని జీవితం వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు ఏఎస్ రవి కుమార్(AS Ravikumar). ఆయన చాలా కాలం తరువాత తెరకెక్కిన చిత్రం తిరగబడరసామీ. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మాల్వీ మల్హోత్రా హీరోయిన్. మన్నారా చోప్రా(Mannara Chopra) కీలక పాత్రలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో సోమవారం ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
Anchor Suma : టాలీవుడ్ యాంకర్స్‌కి సుమ ఇంట ఓనమ్ విందు..
ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సమయంలో దర్శకుడు ఏఎస్ రవి కుమార్ చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. దర్శకుడు ఆమె భుజం చుట్టూ చేతులు వేసి, ఆమె అనుమతి లేకుండానే చెంపపై ముద్దు పెట్టాడు. దీంతో మన్నారా చోప్రా కాస్త అసౌకర్యానికి గురైంది. అనుకోని ఈ ఘటనతో ఆమె ఇబ్బంది పడినట్లు వీడియో కనిపించింది. నవ్వుతూనే కవర్ చేసుకుంటూ కాస్త పక్కకు వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు మండిపడుతున్నారు.
