ఆస్ప‌త్రిలో చేరిన ప్ర‌ముఖ న‌టుడు సాయాజీ షిండే.. ఆందోళనలో అభిమానులు..

ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఆస్పత్రిలో చేరారు.

Sayaji Shinde hospitalized : ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఆస్పత్రిలో చేరారు. ఆయ‌న‌కు ఛాతీలో నొప్పి రావ‌డంతో మ‌హారాష్ట్ర‌లోని స‌తారాలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి కుటుంబ స‌భ్యులు తీసుకువెళ్లారు. ప‌రీక్షించిన వైద్యులు ఆయ‌న గుండెలో కొన్ని బ్లాక్స్ ఉన్న‌ట్లు గుర్తించారు. వెంట‌నే యాంజియోప్లాస్టీ చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

‘గ‌త కొన్ని రోజులుగా సాయాజీ షిండే అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్నారు. చెక‌ప్‌లో భాగంగా కొన్ని ప‌రీక్ష‌లు చేయ‌గా గుండెలో స‌మ‌స్య ఉన్న‌ట్లు తెలిసింది. గుండెలో కుడివైపు 99 శాతం బ్లాక్స్‌ను గుర్తించాం. యాంజియోగ్ర‌ఫీ చేయాల‌ని చెప్పాం. దీంతో ఆయ‌న త‌న షూటింగ్స్ అన్ని క్యాన్సిల్స్ చేసుకుని చికిత్స కోసం ఆస్ప‌త్రిలో చేశారు. విజ‌య‌వంతంగా స‌ర్జ‌రీ పూర్తి చేశాం. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది. త్వ‌ర‌లోనే డిశ్చార్జ్ చేస్తాం.’ అని వైద్యులు చెప్పారు.

Also Read: ‘ఆదిపురుష్’ ట్రోల్స్‌పై నటుడు సంచలన వ్యాఖ్యలు.. నచ్చకపోతే సినిమా చూడటం మానేయండి..

మ‌హారాష్ట్ర‌కు చెందిన సాయాజీ షిండే తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడే. సూరి చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన షిండేకు ఠాగూర్ చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది. గుడుంబా శంక‌ర్‌, సూప‌ర్‌, అత‌డు, రాఖీ, పోకిరి, దుబాయ్ శీను, నేనింతే వంటి చిత్రాల్లో న‌టించారు. తెలుగులోనే కాకుండా త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, మ‌రాఠీ, భోజ్‌పురి, హిందీ బాష‌ల్లోనూ న‌టించారు. విల‌న్‌గానే కాకుండా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టిస్తూ య‌మా బిజీగా ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు