×
Ad

Mario : ‘మారియో’ అంటున్న హెబ్బా పటేల్.. థ్రిల్లర్ సినిమాతో..

తాజాగా దసరా సందర్భంగా 'మారియో' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. (Mario)

Mario

Mario : అనిరుధ్, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కుతున్న సినిమా మారియో. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతలుగా నాటకం, తీస్ మార్ ఖాన్ సినిమాల ఫేమ్ కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

తాజాగా దసరా సందర్భంగా ‘మారియో’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ‘ఎ టర్బో- ఛార్జ్‌డ్ ర్యాంప్ రైడ్’ అనే ట్యాగ్‌లైన్‌ ఈ సినిమా టైటిల్ కి ఇచ్చారు. ఫస్ట్ లుక్‌లో అనిరుధ్, హెబ్బా పటేల్ స్టైలిష్ గా కనిపిస్తూ అనిరుధ్ రైఫిల్ పట్టుకుని, బ్యాక్ గ్రౌండ్ లో కారు, చీకటి, వర్షం సెటప్ తో ఇదొక థ్రిల్లర్ సినిమా అని తెలుస్తుంది.

Also Read : Mahesh Babu : మహేష్ బాబుకు అక్కగా, తల్లిగా నటించిన ఒకే ఒక నటి.. ఎవరో తెలుసా? అప్పట్లో హీరోయిన్..

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రాకేందు మౌళి, మౌర్య సిద్ధవరం, యష్నా ముతులూరి, కల్పిక గణేష్, మదీ మన్నెపల్లి, లతా రెడ్డి.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also See : Kiran Abbavaram : ఫ్రెండ్ పెళ్ళిలో భార్య, కొడుకుతో కలిసి హీరో కిరణ్ అబ్బవరం.. క్యూట్ ఫొటోలు వైరల్..