‘మార్కెట్ రాజా M.B.B.S.’ నవంబర్ 29 విడుదల
ఆరవ్, కావ్యా థాపర్, రాధికా శరత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘మార్కెట్ రాజా M.B.B.S.’ ఈ నెల 29న విడుదల..

ఆరవ్, కావ్యా థాపర్, రాధికా శరత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘మార్కెట్ రాజా M.B.B.S.’ ఈ నెల 29న విడుదల..
బిగ్‌బాస్ ఫేమ్ ఆరవ్, కావ్యా థాపర్, రాధికా శరత్ కుమార్, నికిషా పటేల్, ప్రధాన పాత్రధారులుగా నటించిన తమిళ్ సినిమా.. ‘మార్కెట్ రాజా M.B.B.S.’.. సురభి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఎస్.మోహన్ నిర్మించిన ఈ సినిమాకు శరణ్ దర్శకుడు. ఈ నెల 29న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
‘మార్కెట్ రాజా’లో రాధికది డేరింగ్ అండ్ డాషింగ్ క్యారెక్టర్.. పాత్ర కోసం ఆమె బుల్లెట్ నడపడం, సిగార్ కాల్చడం విశేషం. దర్శకుడు శరణ్ అన్నయ్య, ‘118’తో టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా టర్న్ అయిన ఫేమస్ డీఓపీ కె.వి.గుహన్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించారు.
Read Also : రూ.100 కోట్ల క్లబ్‌లో ‘ఖైదీ’
నాజర్, రోహిణి, షాయాజీ షిండే, ఆదిత్య మీనన్, ప్రదీప్ రావత్ చామ్స్ విశ్వనాధన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి సంగీతం : సైమన్ కె కింగ్, కెమెరా : కె.వి.గుహన్, ఎడిటింగ్ : గోపికృష్ణ.