Keerthy Suresh : చిన్ననాటి స్నేహితుడితో పెళ్లి.. కాబోయే భర్తను పరిచయం చేసిన కీర్తి సురేష్..

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఈ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ వరుస సినిమాల్లో నటించే ఛాన్స్ అందుకుంది.

Marriage with childhood friend Keerthy Suresh introduced her future husband

Keerthy Suresh : నేను శైలజ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఈ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ వరుస సినిమాల్లో నటించే ఛాన్స్ అందుకుంది. నేను శైలజ తర్వాత తన కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘నేను లోకల్’, ‘మహానటి’, ‘అజ్ఞాత వాసి’, ‘దసరా’, ‘మిస్ ఇండియా’ వంటి సినిమాల్లో నటించి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుంది.

Also Read : Supritha : కిస్సిక్ పాటకి అదిరిపోయే స్టెప్పులేసి సుప్రీత.. వీడియో చూసారా..

ఇక ఇలా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న క్రమంలో కీర్తి సురేష్ తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీని గోవాలో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని నిజం చేస్తూ తాజాగా క్లారిటీ ఇచ్చింది కీర్తి సురేష్. తన కాబోయే భర్తను పరిచయం చేసింది. తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలుపుతూ.. 15 ఏళ్ళుగా వారు ప్రేమలో ఉన్నట్టు తెలిపింది. వారిద్దరూ కలిసున్న ఓ ఫోటో షేర్ చేస్తూ.. 15 ఏళ్ళు.. ఇంకా కంటిన్యూ అవుతుంది. AntoNY x KEerthy ( Iykyk) అని తన పోస్ట్ లో పేర్కొంది.


15 సంవత్సరాల నుంచి వీరిద్దరూ కలిసి పెరిగారట. అంతేకాదు ఇద్దరూ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారట. ముఖ్యంగా తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని..ఇద్దరి మధ్య ఆ స్నేహం బాగా పెరగడం వల్లే ప్రేమగా మారి.. ఇప్పుడు పెళ్లి దాకా వచ్చిందట. కాగా డిసెంబర్ 11, 12 తేదీలలో వీరు గోవాలో డెస్టినేషన్ వివాహం చేసుకోనున్నట్టు తెలుస్తుంది.